Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ వేరు. హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ ఏకంగా 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. అక్కడ సక్సెస్ కావడంతో ఇతర భాషలకు కూడా పాకింది. సౌత్ లో మొదట కన్నడ భాషలో ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా బిగ్ బాస్ షో మొదలైంది. 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ప్రసారం అయ్యింది. ఫస్ట్ సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. ఆయన హోస్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
సినిమాల కారణంగా బిజీ అయిన ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలోకి హీరో నాని వచ్చాడు. నాని హోస్ట్ గా విఫలం చెందాడు. ఆయన కనీసం కంటెస్టెంట్స్ ని కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. దీనికి మనం కరెక్ట్ కాదని స్వచ్ఛందంగా బిగ్ బాస్ హోస్టింగ్ కి గుడ్ బై చెప్పేశాడు. సీజన్ 3కి నాగార్జున రంగంలోకి దిగారు. వరుసగా ఐదు సీజన్స్ కి నాగార్జున ప్రాతినిధ్యం వహించాడు. సక్సెఫుల్ హోస్ట్ అనిపించుకున్నాడు.
బిగ్ బాస్ సీజన్ 7గ్రాండ్ సక్సెస్ కాగా… నాగార్జున పాత్ర చాలా ఉంది. ఇక సీజన్ 8 కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కావాలని అంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 8కి డేట్ ఫిక్స్ చేశారు. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 మరో 50 రోజుల్లో ప్రారంభం కానుందట.
సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆగస్టులోనే లాంచ్ చేయాలని మేకర్స్ అనుకున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక, ఇతర ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పట్టిందట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటివారం ఫైనల్ చేశారట. సెప్టెంబర్ 1 ఆదివారం కాగా… ఆరోజే బిగ్ బాస్ లాంచింగ్ డే అంటున్నారు.
ఇక కంటెస్టెంట్స్ ఎవరని పరిశీలిస్తే… సోషల్ మీడియా స్టార్స్ బర్రెలక్క, కుమారీ ఆంటీ ఎంపిక అయ్యారట. అలాగే యూట్యూబర్ బంచిక్ బబ్లు హౌస్లో అడుగుపెట్టనున్నాడట. నటి హేమ మరోసారి బిగ్ బాస్ షోకి వస్తున్నారట. అలాగే నటి సురేఖావాణి కూడా ఛాన్స్ పెట్టేసిందట. ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తారని టాక్.
హాట్ యాంకర్స్ రీతూ చౌదరి, వర్షిణి సుందరరాజన్ బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. కాంట్రవర్షియల్ క్రికెటర్ అంబటి రాయుడు బిగ్ బాస్ షోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. వేణు స్వామికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకువస్తున్నారట. కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, అమృత ప్రణయ్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని గట్టిగా వినిపిస్తోంది.
గత సీజన్ మాదిరి రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ ఉండే అవకాశం కలదు. అంటే లాంచింగ్ ఎపిసోడ్ రోజు మెజారిటీ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారు. 5 వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయి. దాని కోసం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి హౌస్లోకి మిగిలిన కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెడతారు. టీఆర్పీ పరంగా ఇది కలిసొచ్చే అంశం. ఇక సీజన్ 8 కి కూడా హోస్ట్ నాగార్జునే నట.
Web Title: Date fixed for bigg boss telugu 8 contestants list leaked before announcement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com