Roja: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థులను చీల్చి చెండాడడంలో రోజాను మించినవారు లేరు. తన నోటి దురుసుతో ప్రత్యర్థులను పెంచుకున్నారు మాజీ మంత్రి. ఆమో నోటిదురుసే రోజాకు ప్లస్, మైనస్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా చిత్తుగా ఓడిపోయారు. దీంతో ఆమె నగరిలో కనిపించడం లేదు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయంలో ఆమె చేసిన చెత్త పనికి నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా తమిళనాడులోని తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామిని మంగళవారం భర్త సెల్వమణితో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రోజాను కలవడానికి అర్చకులు, ఆలయ అధికారులు వచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆలయంలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది కూడా రోజాను కలిసేందుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగాలని ఆశపడ్డారు. కానీ, వారిపట్ల రోజు అనుచితంగా వ్యవహరించారు. పారిశుధ్య కార్మికులు తన వద్దకు రావొద్దన్నట్లు సైగ చేశారు. వారితో సెల్ఫీ దిగేందుకు నిరాకరించారు. అధికారులు, అర్చకులతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్న రోజా.. పారిశుధ్య కార్మికులతో వ్యవహించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర్ అవుతోంది. దీంతో నెటిజన్లు రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంటరానివాళ్లుగా…
ఈ వీడియోలో మాజీ మంత్రి రోజా.. పారిశుధ్య కార్మికులను అంటరానివారిలా చూశారు. దగ్గరకు వస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులను దూరంగా ఉండమని సైగ చేశారు. ఈ దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మొదట అంతా.. అక్కడ ఉన్నవారు ఫొటో దిగిన తర్వాత.. పారిశుధ్య కార్మికులను రమ్మంటారని భావించారు. కానీ, ఆలయ అధికారులు, సిబ్బందితో ఫొటోలు దిగిన తర్వాత పారిశుధ్య కార్మికులు సెల్ఫీ అడగగా.. వారితో ఫొటో దిగడానికి నిరాకరించి అక్కడి నుంచి భర్తతో కలిసి వెళ్లిపోయారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో కామెంట్లు..
రోజా తిరుచెందూర్ ఆలయంలో పారిశుధ్య కార్మికులతో వ్యవహించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా పొగరు తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రిగా పారిశుధ్య కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. శ్రామిక శక్తిని గుర్తించి గౌరవించలేని వారికి రాజకీయాల్లో ఉండే హక్కుల లేదంటున్నారు. డబ్బు, అహంకారంతో కార్మికులపై వివక్ష చూపుతున్నారు. రోజాగారు ఇది న్యాయమేనా అంటూ కామెంట్లు పెడుతూ మండిపడుతున్నారు.
సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం..
ఇదిలా ఉంటే.. తమిళనాడు తిరుచెందూరులోని ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి వెళ్లిన రోజా తన భర్తతో కలిసి స్వామివారికి ఆడిమాస అభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామి దర్శనం తర్వాత బయటకు రాగానే పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయానికి సంబంధించిన స్టాఫ్ నటి రోజాను తమ సెల్ ఫోన్లలో బంధించారు. అదే సమయంలో ఆలయంలో పనిచేస్తోన్న ఇద్దరు ప్రైవేట్ క్లీనింగ్ వర్కర్స్ రోజాతో సెల్ఫీ దిగడానికి వెళ్లారు. ఈ సందర్భంగా రోజా వారిని తన దగ్గరకు రావొద్దని వారించారు. రోజా కార్మికులను దూరంగా ఉండమని చెబుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నగరికి దూరంగా..
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా… ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆమె నగరికి దూరంగా ఉంటున్నారు. తమిళనాడులోనే గడుపుతున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. కార్యకర్తలను కలవడం లేదు. రోజా ఓటమికి సొంత పార్టీలోని వర్గపోరు కూడా ఓ కారణం. అందుకే ఆమె పార్టీ నేతలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోవివాదంలో చిక్కుకున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Roja motioned to the sanitation workers to keep their distance for selfies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com