Anchor Suma: కోట్ల ఆస్తులు ఉన్నా డబ్బు కోసం ఇంకా అలాంటి పనులు చేస్తున్న యాంకర్ సుమ… దుమ్మెత్తిపోస్తున్న జనాలు!

ఇంత సంపద ఉన్న యాంకర్ సుమ నాసిరకం ప్రొడక్ట్స్ ని డబ్బుల కోసం ప్రమోట్ చేస్తున్నారని సాధారణ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమ ఓ పచ్చళ్ళ తయారీ సంస్థ యాడ్ లో పాల్గొన్నారు.

  • Written By: SRK
  • Published On:
Anchor Suma: కోట్ల ఆస్తులు ఉన్నా డబ్బు కోసం ఇంకా అలాంటి పనులు చేస్తున్న యాంకర్ సుమ… దుమ్మెత్తిపోస్తున్న జనాలు!

Anchor Suma: డబ్బు ఎవరికి చేదు అనే సామెత ఉంది. ఎన్ని కోట్ల ఆస్తిపరుడైనా ఓ రూపాయి ఆదాయం వస్తుందంటే వదులుకోవడానికి ఇష్టపడరు. రెండు మూడు తరాలకు సరిపడా సంపాదించినా యాంకర్ సుమ కూడా అదే చేస్తుంది. డబ్బుల కోసం చెత్త ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుంది. ఈ విషయంలో ఆమెపై జనాలు మండిపడుతున్నారు. సుమ బుల్లితెరపై ఓ చరిత్ర సృష్టించారు. రోజుకు లక్షల్లో సంపాదించే ఆమె కోట్లలో కూడబెట్టారు. హైదరాబాద్ లో సుమకు లగ్జరీ హౌస్ ఉంది. ఆ ఇంట్లో షూటింగ్స్ కూడా జరుగుతాయట. భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొంత సంపాదిస్తున్నాడు. రాజీవ్ సంపాదన కంటే సుమ ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారు.

ఆ మధ్య సుమ భర్తతో విడిపోతుందనే ప్రచారం జరిగింది. రాజీవ్ కనకాల-సుమ కొన్నాళ్ళు విడివిడిగా ఉన్నారు. దీంతో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. తర్వాత సుమ ఈ వార్తలను పరోక్షంగా ఖండించారు. ఇద్దరూ కలిసి ఓ షో చేశారు. రాజీవ్ కనకాల అయితే వివరణ ఇచ్చారు. నేను కొన్నాళ్ళు మా నాన్నగారి ఇంట్లో ఉన్న విషయం నిజమే. అయితే అది మనస్పర్ధలతో కాదు. కొన్ని కారణాల వలన దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.

ఇంత సంపద ఉన్న యాంకర్ సుమ నాసిరకం ప్రొడక్ట్స్ ని డబ్బుల కోసం ప్రమోట్ చేస్తున్నారని సాధారణ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమ ఓ పచ్చళ్ళ తయారీ సంస్థ యాడ్ లో పాల్గొన్నారు. ఆ సంస్థ పచ్చళ్ళు అద్భుతం అంటూ వీడియోలో చెప్పారు. ఆ పచ్చళ్ళు వాడిన కస్టమర్స్ కి చేదు అనుభవం ఎదురైంది. టేస్ట్ లేకుండా నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి నాణ్యత లేని ప్రొడక్ట్స్ ని డబ్బుల కోసం సుమ ప్రోమోట్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా నేరుగా సుమకు తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సుమ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. సుమ ఈ మధ్య ఎక్కువగా షోలు చేయడం లేదు. సుమ అడ్డా టైటిల్ తో ఓ టాక్ షో చేస్తున్నారు. గతంలో సుమ అరడజను షోలు చేసేవారు. మరోవైపు ఆమె కొడుకును హీరోగా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు సుమ ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు