Anchor Suma: తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యాంకర్లలో సుమ ఒకరు. ఈమె చేసిన ప్రతి షో కూడా సూపర్ సక్సెస్ అవుతుందనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.ఎందుకంటే ఈమె గత రెండు దశాబ్దాల నుంచి టెలివిజన్ రంగంపై తనదైన సత్తా చాటుతూ ప్రేక్షకులకు ఎక్కడలేని ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. అయితే చాలా రోజుల నుంచి తెలివిజన్ రంగం పై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ క్రమంలోనే ఆమె సినిమా ఈవెంట్లకి కూడా చాలా వాటికి యాంకర్ గా చేస్తూ చాలా బిజీ యాంకర్ గా కొనసాగుతూ వస్తుంది.అయితే యాంకర్ సుమ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆమె యాంకరింగ్ ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆమె యాంకరింగ్ రొటీన్ గా అనిపించడం తో కొంతమంది ప్రొడ్యూసర్స్ యంగ్ యాంకర్ లని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో సుమ అప్పుడప్పుడు కొన్ని అనవసరపు విషయాలని స్టేజ్ పైన మాట్లాడుతూ ఆ తర్వాత ఎందుకు మాట్లాడానా అని ఇబ్బంది పడిన క్షణాలు కూడా చాలానే ఉన్నాయి.ఇక రీసెంట్ గా జరిగిన ఆదికేశవ సినిమా సాంగ్ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన సుమ ఆ ఈవెంట్ లో పాల్గొన్న మీడియా సంస్థల రిపోర్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మీడియా వాళ్ళు స్నాక్స్ ని కూడా భోజనం చేసినట్టుగా చేస్తున్నారు. అంటూ వాళ్ళ పైన ఒక సెటైరికల్ కామెంట్ ని వదిలింది.
దాంతో అక్కడున్న ఒక సీనియర్ రిపోర్టర్ సుమ పైన సీరియస్ అవ్వడం తో సుమ సరే అని స్నాక్స్ ని స్నాక్స్ లాగే తింటున్నారు అంటూ ఆ మాటను మళ్ళీ సర్దుమనిగెలా చేసింది.అయిన కూడా ఆమె చెప్పింది వాళ్ళు వినకపోవడంతో ఆ రిపోర్టర్ల కి సారీ చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు అనే కాదు సుమ ఇంతకుముందు ఒక ఈవెంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన దేవర సినిమా మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని సభాముఖంగా ఎన్టీఆర్ ని అడగటంతో దానికి కొంచెం ఇబ్బంది పడ్డ ఎన్టీయార్ సుమ వైపు సీరియస్ గా చూడడం జరిగింది.దాంతో అప్పుడు కూడా సుమ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ ని చేశారు.
ఇలా కొన్ని సందర్భాల్లో సుమ యాంకరింగ్ చాలా బాగున్నప్పటికీ మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఆమె చేసిన అతికి హీరోలనుంచి గాని,హీరోల ఫ్యాన్స్ నుంచి గాని ఆమె కొంత వరకు ఇబ్బందులు ఎదురకున్న విషయాలు కూడా గతంలో చాలానే ఉన్నాయి. అందుకే యాంకరింగ్ అనేది యాంకరింగ్ లా చేస్తే బాగుంటుందని చాలామంది ఆమెకి సలహాలు ఇస్తున్నారు…
Words War Between Film Journalist and Anchor #Suma At #Aadikeshava Song Launch event pic.twitter.com/nf6Ld5GO8R
— Tollywood insights (@Tollywoodinsigh) October 25, 2023