Praveen Sattaru: ‘ప్రవీణ్ సత్తారు’ మంచి మేకర్. అంతకంటే మంచి కథకుడు. తన స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ప్రవీణ్ సత్తారు సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా.. ఆయన సినిమాని చూడాలని అనిపిస్తోంది. పైగా ప్రవీణ్ సత్తారు చిత్రాల్లో బలమైన కథలుంటాయి. అయితే.. ఈమధ్య టెక్నికల్ విషయాలపైనే ప్రవీణ్ సత్తారు ఫోకస్ పెడుతున్నట్టు అనిపిస్తోంది. దానికి పెద్ద ఉదాహరణ `ది ఘోస్ట్`.
పైకి ప్రవీణ్ సత్తారు ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ, మహేష్ సినిమా నేనొక్కడినే సినిమాకు ధీటుగా ఈ సినిమాని తీద్దామనుకొన్నాడు. అందుకు తగినట్టుగానే పాపులర్ తారాగణాన్ని ఎంచుకొన్నాడు. నాగార్జున కూడా ప్రవీణ్ సత్తారు పై మంచి నమ్మకాలూ పెట్టుకున్నాడు. నిర్మాణ సంస్థతో మాట్లాడి భారీగా ఖర్చు పెట్టేలా చర్యలు అండ్ చొరవ తీసుకున్నాడు.
మొత్తానికి ప్రవీణ్ సత్తారు భారీ మొత్తంలో ఖర్చు పెట్టి మరీ ఘోస్ట్ సినిమా తీశాడు. సాంకేతికంగా అద్భుతంగా కనిపించాలన్న ఉద్దేశంతో ‘ఘోస్ట్`ని వండర్ ఫుల్ విజువల్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. అయితే, ఆ విజువల్ యాక్షన్ ఎఫెక్టులు పెద్దగా కనిపించడం లేదు. భారీ యాక్షన్ సీక్వెన్సెన్స్ కోసం సినిమా ఆలస్యమైంది. పైగా భారీగా ఖర్చు అయింది. అయినా పెద్దగా ఒరిగిందేం లేదు అనే అభిప్రాయంలో ఉన్నారు నిర్మాతలు.
బయ్యర్లు కూడా ఆలోచనలో పడ్డారు. ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నాగార్జున ఒకప్పుడు స్టార్ హీరోనే. కానీ ఇప్పుడు కాదు. మీడియం రేంజ్ హీరోగానే నాగ్ ను పరిగణించాలి. అంతకు ముందే కల్యాణ్ రామ్ `ఓం` సినిమా గుర్తుండే ఉంటుంది కదా. ఈ సినిమా విషయంలో బయ్యర్లు బాగా నష్టపోయారు. యాక్షన్ ఎఫెక్టులు ఆ సినిమాకి కలసి రాలేదు. సేమ్ ఘోస్ట్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.
మరి ఏమిటి నాగ్ పరిస్థితి ?, సినిమా ప్లాప్ అయితే.. నాగార్జునకి ఉన్న మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది. ప్రవీణ్ సత్తారు తప్పేం లేదు. ఒక దర్శకుడిగా తన సినిమాని భారీగా చూపించాలన్న నిర్ణయం తీసుకొన్నాడు. అందుకు తగిన ప్రతిఫలం ఉంటుందా ? లేదా ? అనేది అతనికి సంబంధించిన విషయం. ఒక దర్శకుడిగా తన పనితనం తనకు ముఖ్యం. ఈ విషయంలో ‘ప్రవీణ్ సత్తారు’ సక్సెస్. కమర్షియల్ గా ప్లాపే.