Unstoppable With NBK Chiranjeevi: ఆహా యాప్ లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ న్బక్’ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..ఈ టాక్ షో ద్వారా బాలయ్య బాబు రేంజ్ మారిపోయింది..టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు రాజకీయ విశ్లేషకులతో బాలయ్య బాబు ఈ షో లో చేసిన హడావడి అంతా ఇంత కాదు..బాలయ్య లో ఇంత చిలిపితనం దాగి ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ బిగ్గెస్ట్ టాక్ షో.

Unstoppable With NBK Chiranjeevi
ఈ టాక్ షోకి నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి వాళ్ళు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు కానీ , బాలయ్య తరం హీరోలైవున్న చిరంజీవి , వెంకటేష్ మరియు నాగార్జున మాత్రం హాజరవ్వలేదు.ఈ టాక్ షో కి సంబంధించిన టీం మెగాస్టార్ డేట్స్ కోసం ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరంజీవి ని తీసుకొని రావాలని అల్లు అరవింద్ ప్రయత్నం చేసాడట..కానీ చిరంజీవి కి ఆ సమయం లో వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ గా ఉండడం వల్ల రాలేకపోయాడు, ఆ తర్వాత మొదటి సీజన్ 7 వ ఎపిసోడ్ కి కూడా మెగాస్టార్ ని తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసాడట అల్లు అరవింద్, కానీ కుదర్లేదు.ఇక రెండవ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి కూడా ముందుగా చిరంజీవిని అడిగాడట అల్లు అరవింద్,కానీ ఎందుకో ఆయన ఆసక్తి చూపలేదు.

Unstoppable With NBK Chiranjeevi
ఇక రీసెంట్ గా టెలికాస్ట్ అయినా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ముఖ్య అతిధిగా అలా 5 నిమిషాల పాటు వచ్చి వెళ్ళమన్నా చిరంజీవి ఒప్పుకోలేదట..ఇలా నాలుగు సార్లు పిలిచినా రాకపొయ్యేసరికి చిరంజీవికి ఎందుకో ఈ షో నచ్చలేదని అర్థం అవుతుంది.గతం లో బాలయ్య చిరంజీవి మీద చాలా సెటైర్స్ వేసేవాడు, బహుశా అది మనసులో పెట్టుకొని ఇక చేస్తుండొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు.