Devotional Tips: ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులివే?

Devotional Tips: మనలో చాలామంది ఎంతో ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఆంజనేయ స్వామి గుళ్లు ఉన్నాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా మహిళలు స్వామివారిని తాకడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి భక్తులు స్వామికి ఏమైనా సమర్పించాలని […]

  • Written By: Navya
  • Published On:
Devotional Tips: ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులివే?

Devotional Tips: మనలో చాలామంది ఎంతో ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఆంజనేయ స్వామి గుళ్లు ఉన్నాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు.

ముఖ్యంగా మహిళలు స్వామివారిని తాకడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయ స్వామి భక్తులు స్వామికి ఏమైనా సమర్పించాలని భావిస్తే నేరుగా కాకుండా పూజారి ద్వారా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆంజనేయ స్వామి పాదాలను తాకడం కూడా మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుడు పాదల క్రింద భూతప్రేతపిశాచాలను అణచివేసి ఉంటారు.

అందువల్ల స్వామివారి పాదాలను తాకడం మంచిది కాదు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన సమయంలో చాలామంది 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే 27, 54 ప్రదక్షిణలు చేసినా కూడా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడిలో “శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయజయ హనుమాన్” అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.

ఆంజనేయ స్వామిని భక్తులు వేర్వేరు పేర్లతో పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఆంజనేయ స్వామి గుడిలో మూడు ప్రదక్షిణలు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు