Jagan vs Pawan Kalyan : ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే ప్రసంగాలు మరీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. అదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ఆ డబ్బులు ఎవరివి? జనాలను తరలించడం.. నిర్వహించడం అంతా ఏపీ ప్రజల సొమ్ముది. ఎవరినైతే మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేస్తున్నారో ఆయనే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టాక్స్ పేయర్స్ లో ఒకరు. మీ ప్రభుత్వం నడుపడానికి కావాల్సిన ఖర్చును సమకూర్చే వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ ప్రభుత్వ కార్యక్రమం అయిపోయాక వేరే పార్టీ ఆఫీసులో మీరు పవన్ కళ్యాణ్ ను తిడితే తప్పు లేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎందుకు తిడుతున్నారన్నది ప్రశ్న.
పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు జగన్ ఇచ్చే సమాధానాలకు అసలు పొంతన లేదు. ప్రభుత్వ పెన్షన్ ఎందుకు తగ్గించారని పవన్ ప్రశ్నిస్తే.. వారికి అన్యాయం జరుగుతుందని నిలదీస్తే.. అది చెప్పకుండా పవన్ కళ్యాణ్ భార్యల గురించి వ్యక్తిత్వ హననం చేస్తున్న జగన్ కు విలువలు ఎక్కడ ఉన్నాయన్నది ప్రశ్న.
పవన్ కళ్యాణ్ పై జగన్ చేస్తున్న వ్యక్తిత్వ హననం విమర్శలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.