Homeఅంతర్జాతీయంKai Madison : కొడుకు కాదు.. కూతురు ఇవాంక అంతకన్నా కాదు.. ట్రంప్ వారసురాలు ఆమే.....

Kai Madison : కొడుకు కాదు.. కూతురు ఇవాంక అంతకన్నా కాదు.. ట్రంప్ వారసురాలు ఆమే.. తొలి ప్రసంగంతోనే అదరగొట్టింది

Kai Madison : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ప్రధానంగా ఉన్నవి రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేస్తున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. 2020లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీలో ఉన్నారు. 2020 ఎన్నికల్లో ఆయన ట్రంప్ పై విజయం సాధించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి నాలుగేళ్లకోసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి వాన్స్ ను అభ్యర్థిగా ట్రంప్ ప్రకటించారు. గత శనివారం పెన్సిల్వేనియాలో హత్యాయత్నానికి గురైన ట్రంప్.. ప్రజల నుంచి విపరీతమైన ఆదరణను పెంచుకున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సర్వేలలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవుతారని తెలుస్తోంది.
జోరుగా ప్రచారం 
ఎన్నికలను పురస్కరించుకుని ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలలో సదస్సులు నిర్వహిస్తున్నారు.. తాజాగా రిపబ్లికన్ పార్టీ ఓ జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు పార్టీలోని ట్రంప్ సహా అగ్ర నాయకులు మొత్తం హాజరయ్యారు. అయితే ఆ సదస్సులో 17 సంవత్సరాల అమ్మాయి చేసిన ప్రసంగం సభికులందరినీ మంత్రముగ్ధులను చేసింది.  అమ్మాయి డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కుమార్తె. ఆమె పేరు కైమాడిసన్. అమెరికాలో +2 చదువుతోంది. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ఆమె ప్రముఖంగా ప్రసంగించింది.
మీకు తెలియని ట్రంప్ 
కైమాడిసన్ మా తాతయ్య ట్రంప్ గురించి చెప్పుకుంటూ మురిసిపోయింది. తెల్లటి ఆధునాతనమైన దుస్తులు ధరించిన మాడిసన్ పోడియం వద్ద నిల్చుని.. ధైర్యంగా ప్రసంగించింది..”మా తాతయ్యను మీడియా భిన్నమైన వ్యక్తిగా ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన ప్రేమ సముద్రం. ఆయన ఆప్యాయత ఆకాశం. ఆయన అనురాగం అనన్య సామాన్యం. ఆయన మాతో ఎక్కువ సమయం ఉంటారు. మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మా తాతయ్యకు మనవాళ్లు, మనవరాళ్లు కలిసి పది మంది దాకా ఉంటారు.. మా అందరితో సరదాగా ఉంటారు. ఆటలు కూడా ఆడుతుంటారు. నాకు స్కూల్లో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు దాన్ని ప్రింట్ అవుట్ తీశారు. ఆయన స్నేహితులకు గర్వంతో ఉప్పొంగిపోయి చూపించారు. ఆ క్షణాన్ని నిన్ను మర్చిపోలేను. మా తాతయ్య నేను కలిసి గోల్ఫ్ ఆడుతాం. ఆయనను ఓడించేందుకు నేను శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటాను. నేనే ట్రంప్ ను. మీకు కాబోయే వారసురాలిని అని ఆయనకు గుర్తు చేస్తుంటా.. మా తాతయ్య పై ఇటీవల పెన్సిల్వేనియా ప్రాంతంలోని బట్లర్ ఏరియాలో హత్యాయత్నం జరిగింది. దానికి సంబంధించిన వార్తలు విన్నప్పుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. మా తాతయ్య చాలా గొప్ప మనిషి.. అమెరికా కోసం ఏదైనా చేయగలరు. అలాంటి వ్యక్తిని చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ ఆయన చాలా ధైర్యంగా నిలబడ్డారు. నాలాంటి వాళ్లకు ఆయనే స్ఫూర్తి. ఏదో ఒక రోజు నేను ఆయన స్థాయిని అందుకుంటాను ఐ లవ్ యు” అంటూ కైమాడిసన్ తన ప్రసంగాన్ని ముగించారు.
వారసురాలు ఆమెనా
ట్రంప్ కు ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ.. ఇవాంకా తప్ప ఇంతవరకు ఎవరూ ప్రజా బాహుళ్యం లో కనిపించలేదు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇవాంకా పలు దేశాలలో పర్యటించారు. అందులో భారత్ కూడా ఒకటి. ట్రంప్ కుమారులు ఎక్కడా కనిపించలేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్రంప్ కు ఇవే చివరి అధ్యక్ష ఎన్నికలు. అయితే ఆయన తర్వాత.. ఆ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు? అనే ప్రశ్నకు జై మాడిసన్ తన ప్రసంగం రూపంలో సమాధానాన్ని తెలియజేసింది. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో బలంగా మాట్లాడటంతో.. ఆమె ట్రంప్ కు కాబోయే వారసురాలని అమెరికా మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది
Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular