Homeఅంతర్జాతీయంJoe Biden: అనారోగ్య సమస్యలు ఉంటే తప్పుకుంటానని ప్రకటించిన గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు...

Joe Biden: అనారోగ్య సమస్యలు ఉంటే తప్పుకుంటానని ప్రకటించిన గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు షాకింగ్ పరిణామం

Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరన జరుగనున్నాయి. ఇప్పటికే అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌.. రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో నిలిచారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే ఇద్దరు అభ్యర్థులపై అమెరికన్లు అసంతృప్తితోనే ఉన్నారు. ట్రంప్‌ పాలనను ఇప్పటికే చూసిన అమెరికన్లు ఆయనను ఎన్నుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇక బైడెన్‌ పాలన బాగానే ఉన్న వృద్ధాప్యం, మతిమరుపు కారణంగా ఆయనను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుల సంక్షోభం ఎదుర్కొంటోంది.

బైడెన్‌ను తప్పించాలని ఒత్తిడి..
డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని మార్చాలని అమెరికన్లు, పార్టీని నిధులు సమీకరించే ప్రతినిధులు కోరుతున్నారు. బైడెన్‌ అభ్యర్థి అయితే పార్టీ గెలవదని బహిరంగంగానే సూచిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల గవర్నర్లు కూడా అభ్యర్థిని మార్చాలని కోరుతున్నారు. ప్రజలు, పార్టీ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలి కమలాహ్యారిస్‌ అధ్యక్ష రేసుకో ఉంటారని ప్రచారం జరుగుతోంది.

హింట్‌ ఇచ్చిన బైడెన్‌.,
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్‌ ఓ హింట్‌ ఇచ్చారు. కమలా హ్యారిస్‌ అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలు అని ప్రకటించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. బైడెన్‌ బుధవారం(జూలై 17న) నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్స్‌ అన్వాల్‌ కన్వేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ కమలా హ్యారిస్‌ గురించి ప్రస్తావించారు. హ్యారిస్‌ గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదని, ఆమె అమెరికా ప్రెసిడెంట్‌ కూడా కావొచ్చని ప్రకటించారు. అధ్యక్షుడి మాటలు విన్న డెమోక్రాట్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బైడెన్‌ తాజా వ్యాఖ్యలు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

బైడెన్‌కు కోవిడ్‌..
అమెరికా అధ్యక్షుడు కోవిడ బారిన పడ్డారు. ఈమేరకు వైట్‌హౌస్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం ఆయన డెలావేర్‌ సముద్ర తీరంలోని తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. కోవిడ్‌ చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ప్రచారంలో ఉండగా..
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్‌ వెగాస్‌లో ప్రచారంలో ఉన్న బైడెన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన ఇంటికి వెళ్లిపోయారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఇంటి నుంచే ఆయ విధులు నిర్వహిస్తారని వైట్‌హౌస్‌ తెలిపింది. స్వల్ప లక్షణాలు కనిపించగా, పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన పనాక్స్‌లోవిడ్‌ యాంటీ వైరస్‌ డ్రగ్‌ ఇచ్చినట్లు తెలిపింది. యునిడోస్‌ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న ఆయన అర్ధంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లోకి ఎక్కేటప్పుడు బైడెన్‌ మాస్క్‌ ధరించి లేకపోవడం గమనార్హం.

ఆనారోగ్య సమస్యలు వస్తే తప్పుకుంటానని..
ఇదిలా ఉండగా మంగళవారం ఓ ఇంటర్వ్యూలో బైడెన్‌ మాట్లాడుతూ తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలగం గురించి ఆలోచిస్తానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే బైడెన్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఇప్పుడు బైడెన్‌ తప్పుకుంటారా అన్న చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular