Aswani Dutt: కల్కి 2829 గ్రాండ్ సక్సెస్. ఫస్ట్ షో నుండే కల్కి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ ప్రభావం ఓపెనింగ్స్ లో కనిపించింది. వరల్డ్ వైడ్ కల్కి భారీ వసూళ్లు రాబట్టింది. కల్కి మూవీ రూ. 1000 కోట్లు వసూళ్ల మార్క్ చేరుకున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. యూఎస్ లో కల్కి $16 మిలియన్స్ కి పైగా రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసింది. యూఎస్ తో పాటు ఇతర దేశాలతో కలిపి ఓవర్సీస్ కలెక్షన్స్ $30 మిలియన్స్ కి పైమాటే. హాలీవుడ్ తరహాలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం విదేశాల్లో కల్కికి కలిసొచ్చింది.
కల్కి హిందీ వెర్షన్ సైతం రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. మూడు వారాలుగా నార్త్ లో కల్కి వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీకెండ్ లో మరింత జోరు చూపిస్తుంది. కల్కి హిందీ వెర్షన్ రూ. 255 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ చెప్పుకొచ్చారు. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే.. వరల్డ్ వైడ్ రూ. 370-380 కోట్లకు అమ్మారని సమాచారం. ప్రస్తుతం కల్కి వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.
దాదాపు రూ. 120 నుండి 130 కోట్ల లాభాలు కల్కి తెచ్చిపెట్టింది. కల్కి నిర్మాత అశ్వినీ దత్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయన కెరీర్లో భారీ లాభాలు పంచిన చిత్రం మాత్రం కల్కి కాదు. 100 కోట్లు రాబట్టినప్పటికీ… కల్కి ఆ చిన్న మూవీ సక్సెస్ ముందు బలాదూరే. ఆ మూవీ ఏమిటో తెలుసా… పెళ్లి సందడి.
అశ్వినీ దత్-అల్లు అరవింద్ కలిసి ఓ స్మాల్ బడ్జెట్ మూవీ చేయాలని అనుకున్నారట. కథలు ఏమైనా ఉన్నాయా అని కే రాఘవేంద్రరావుని కలిశారట. చిన్న హీరోకి సెట్ అయ్యేలా పెళ్లి సందడి స్క్రిప్ట్ ఆయన దగ్గర సిద్ధంగా ఉందట. ఆ ప్రాజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారట. శ్రీకాంత్ ని హీరోగా ఎంచుకున్నారు. రవళి, దీప్తిభట్నాగర్ హీరోయిన్స్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పెళ్లి సందడి తెరకెక్కింది.
సంక్రాంతి కానుకగా 1996 జనవరి 12న విడుదల చేశారు. సంక్రాంతి మూడ్ కి పక్కా సెట్ అయిన పండగలాంటి సినిమా పెళ్లి సందడి. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్. అప్పట్లో మూవీ విడుదలకు చాలా రోజుల ముందే క్యాసెట్స్ రూపంలో సాంగ్స్ విడుదలయ్యేవి. జనాల్లోకి కీరవాణి సాంగ్ విపరీతంగా వెళ్లాయి. విలన్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్ హీరోగా ఎదుగుతున్న టైం లో పెళ్ళిసందడి పడింది. శ్రీకాంత్ దశ మార్చేసింది.
ఈ చిత్ర బడ్జెట్… రాబట్టిన కలెక్షన్స్ చూస్తే మతిపోవాల్సిందే. పెళ్లి సందడి చిత్రాన్ని కేవలం రూ. 1.25 కోట్లతో నిర్మించారట. పెళ్లి సందడి రన్ ముగిసేనాటికి రూ. 12 నుండి 13 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడికి దాదాపు 10 రెట్లు లాభాలు వచ్చాయి. చిన్న సెంటర్స్ లో కూడా సిల్వర్ జూబ్లీ ఆడింది. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా పెళ్లి సందడి సినిమా టికెట్ ధర రూ.5 నుండి 30 రూపాయలు మాత్రమే. ఇప్పటి రేట్లతో పోల్చుకుంటే పెళ్లి సందడి మూవీ వందల కోట్ల వసూళ్లు రాబట్టేది. అశ్వినీ దత్, అల్లు అరవింద్ కి పెళ్లి సందడి కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది.
Web Title: Do you know any movie that brought huge profits to ashwin dutt
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com