Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలుసు… ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి స్వయం పోరాటం చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న నటుడు ‘చిరంజీవి’… ఇక ఆయన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో ఆయన తమ్ముడు అయిన ‘పవన్ కళ్యాణ్’ ఒకరు. నిజానికి మొదట పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలతో తనను తాను ‘పవర్ స్టార్’ గా మార్చుకున్నాడు. ఇక అంతే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వైవిధ్యభరితమైన సినిమాలను చేయడమే కాకుండా వ్యక్తిత్వం పరంగా కూడా చాలా మందికి సహాయాన్ని అందిస్తూ చాలా మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా భాద్యతలను కొనసాగిస్తూనే, అవకాశం దొరికినప్పుడు సినిమాలు చేయడానికి కమిట్ అవుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన 3 పెళ్లిళ్లు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మొదట పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నప్పటికీ, అది ఆయనకు అంత బాగా వర్కవుట్ అయితే కాలేదు. దాంతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసుకున్న రెండు పెళ్లిళ్లు కూడా ప్రేమ పెళ్లిల్లే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వీళ్లను కాకుండా తన పెళ్లికి ముందే ఒకరిని విపరీతంగా ప్రేమించారట.
వాళ్ల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే సిద్ధంగా ఉండేవారట. అది ఎవరు అంటే రివాల్వర్ అని తెలుస్తుంది. అవును మీరు విన్నది నిజమే…పవన్ కళ్యాణ్ అమితంగా ఇష్టపడే వాటిలో గన్ ఒకటి… అందుకే పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాలో ఎక్కువగా మనం గన్స్ ను వాడుతున్నాం అని చెబితే చాలు పవన్ కళ్యాణ్ ఈజీగా డేట్ ఇస్తారు అంటూ పవన్ కళ్యాణ్ మీద ఫన్నీ గా ఒక కామెంట్ అయితే చేశాడు. అందుకే పవన్ కళ్యాణ్ మొదట్లో గన్స్ ను ఎక్కువగా వాడుతూ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి తన ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి గన్స్ అంటే విపరీతమైన పిచ్చి పెరిగిందట. దాంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గన్ పట్టుకోవడం, దాన్ని తిప్పుతూ ఉండడం అనేది ఆయనకు చాలా ఇష్టమట.
అందులో భాగంగానే ఆయన అభిరుచిని గమనించిన చిరంజీవి తను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఒక లైసెన్స్డ్ రివాల్వర్ ను తీసుకొని తనకి గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక దాంతో పవన్ కళ్యాణ్ రోజు ఆ గన్ పట్టుకొని తిరుగుతూ ఉండేవాడట. పడుకునేటప్పుడు కూడా ఆ గన్ ను ఆయన దిండు దగ్గర పెట్టుకునేవాడట. ఇక పొద్దున లేవగానే దాన్ని తీసి మొదటి కిస్ దానికే ఇచ్చేవారట. అలా గన్నుతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. తన మొదటి లవర్, తన మొదటి భార్య కూడా తన గన్నే అంటూ ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలియజేయడం విశేషం…ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దే పనిలో బిజీ గా ఉన్నాడు…అది అయిపోయాక మళ్ళీ సినిమా వైపు వస్తాడు…