OTT: వ్యాపారం ఏదైనా ఇండియా బెస్ట్ మార్కెట్. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో సక్సెస్ అయితే విపరీతమైన లాభాలు గడించవచ్చు. భారత్ అటు పేద దేశం కాదు.. అలా అని రిచ్ కంట్రీ కూడా కాదు. అన్ని రకాల ఆదాయ వర్గాల వారు ఉంటారు. ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రెవెన్యూ $360.6 మిలియన్ డాలర్స్(2022 లెక్కల ప్రకారం). అందుకే ఓటీటీ సంస్థలు మన దేశం పై దృష్టి సారించాయి. మార్కెట్ షేర్ పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.
హాట్ స్టార్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, సోని లివ్, ఆపిల్ టీవీ ప్లస్ వంటి అంతర్జాతీయ సంస్థలు డిజిటల్ ఇండస్ట్రీలో పోటీపడుతున్నాయి. చందాదారుల సంఖ్య ఆధారంగా హాట్ స్టార్, జియో సినిమా, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ 5 టాప్ ఫైవ్ లో ఉన్నాయి. 4.92 కోట్ల చందాదారులతో హాట్ స్టార్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. మిగతా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి హాట్ స్టార్ సబ్స్క్రైబర్స్ లో సగం కూడా లేరు. రెవెన్యూ పరంగా కూడా హాట్ స్టార్ అందరికంటే ముందు ఉంది.
మూవీస్, సిరీస్లు, టెలివిజన్ కంటెంట్, స్పోర్ట్స్… ఇలా వైవిధ్యమైన కంటెంట్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అలాగే హాట్ స్టార్ కి కలిసొస్తున్న మరొక అంశం సబ్స్క్రిప్షన్ చార్జెస్. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ తో పోల్చుకుంటే హాట్ స్టార్ చార్జెస్ రెండింతలు తక్కువగా ఉంటాయి. ప్రైమ్ ఒక నెల సబ్స్క్రిప్షన్ చార్జెస్ తో హాట్ స్టార్ మూడు నెలలు ఎంజాయ్ చేయవచ్చు. అంత వ్యత్యాసం ఉంది. హాట్ స్టార్ కంటే తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ ఇచ్చే డొమెస్టిక్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. అయితే హాట్ స్టార్ రేంజ్ లో కంటెంట్ అందించే సత్తా వాటికి లేదు.
హాట్ స్టార్ ని అధిగమించాలని ప్రైమ్, నెట్ఫ్లిక్స్ చాలా కాలంగా ట్రై చేస్తున్నాయి. హాట్ స్టార్ తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ ఇవ్వడానికి అసలు కారణం… యాడ్స్. హాట్ స్టార్ లో చిత్రాలు, సిరీస్ల మధ్యలో వ్యాపార ప్రకటనలు మనం చూడొచ్చు. చందాదారులు తక్కువ ధరలకు సబ్స్క్రిప్షన్ ఇచ్చి.. యాడ్స్ ద్వారా మరోవైపు నుండి ఆదాయం ఆర్జిస్తున్నాయి. రెండు మార్గాల్లో రెవెన్యూ ఆర్జిస్తూ హాట్ స్టార్ బ్యాలన్స్ చేస్తుంది.
ఇదే టెక్నీక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సైతం పాలో కానున్నాయని సమాచారం. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సంస్థలు రెండు రకాల ప్లాన్స్ అందుబాటులోకి తేనున్నాయట. ఇకపై యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్ ఉండకపోవచ్చని అంటున్నారు. సినిమాలు సిరీస్లలో మధ్య వ్యాపార ప్రకటనలు ప్రసారం కానున్నాయట. వ్యాపార సంస్థల నుండి రెవెన్యూ ఆర్జిస్తూ… చందాదారులకు తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ ఇస్తారట. దీని వలన భారీగా చందాదారులు పెరుగుతారని… ఆదాయం పెరుగుతుందని సదరు సంస్థల ఆలోచన అట.
అయితే దీనితో ఓ చిక్కు కూడా ఉంది. కొత్త సినిమాను ఎలాంటి అంతరాయం లేకుండా ప్రేక్షకులు వీక్షించాలి అనుకుంటారు. మధ్యలో వ్యాపార ప్రకటనలు డిస్టర్బ్ చేస్తే ఆడియన్స్ నిరాశకు గురయ్యే ఛాన్స్ ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఎక్కువ ధర చెల్లించిన చందాదారులు యాడ్ ఫ్రీ కంటెంట్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఇండియన్ మూవీ లవర్స్ అభిరుచి మారింది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి అంతకంతకూ ఆదరణ పెరుగుతుంది. మార్కెట్ లో ఇంకో పదేళ్లు నిలబడగలితే… లాభాల పంట పండుతుంది. కాబట్టి పోటీని తట్టుకుని సబ్స్క్రైబర్స్ ని ఆకర్షిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంది.
Web Title: Prime and netflix subscribers will be offered a subscription at a lower price
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com