Photo Story : తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావు పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గా ఎన్నో అద్భుత చిత్రాలు తీసి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అలనాటి సీనియర్ నటులతోనే స్టెప్పులు వేయించిన ఆయన నటుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించారు. దాసరి సినిమాలు ఎక్కువగా సామాన్యులకు సంబంధించినవే ఉంటాయి. కార్మికులు, కర్షకులు పడే కష్టాలను దాసరి తన చిత్రాల ద్వారా చూపించేవారు. అలాగే తెలంగాణ అడవుల్లో మహిళలు పడే కష్టాలను చెప్పేవారు. అలా తన మదిలో నుంచి తీసిన చిత్రం ‘ఓసేయ్ రాములమ్మ’. విజయశాంతి కీలక రోల్ లో నటించిన ఓసేయ్ రాములమ్మ 1997లో రిలీజై 200 రోజులు నటించి సంచలనం సృష్టించింది.
అణగారిన వర్గాలు దొరల చేతిలో ఎలా బలవుతారో చూపించిన ఈ సినిమాను చూసేందుకు గ్రామాల నుంచి తరలి వచ్చేవారు. ఇక ఇందులో విజయశాంతి మెయిన్ రోల్ లో నటించగా.. చిన్నప్పటి విజయశాంతిలా ఓ అమ్మాయి కనిపించింది. ‘ఓసెయ్ రాములమ్మ’ పాట మొత్తం ఈమెనే కనిపిస్తుంది. అయితే ఆమె గురించి ఎవరూ పెద్దగా చర్చించుకోలేదు. కనీసం వివరాలు తెలియపర్చలేదు. దాసరి నారాయణ రావు చిన్న విజయశాంతిగా ఆ అమ్మాయి బాగుంటుందని తీసుకున్నారట. ఆ పాత్రలో అమ్మాయి జీవించింది.
ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన తరువాత ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక పుట్టింది. అయితే ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పిందట. కానీ వాళ్లది నార్మల్ ఫ్యామిలీ కాబట్టి రిజెక్ట్ చేశారట. దీంతో చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చిందట. తనకు మళ్లీ సినిమాల్లో అవకాశం ఇవ్వాలని దాసరి నారాయణ రావు వెంట పడేదట. ఎన్నోసార్లు సర్దిచెప్పి ఇంటికి పంపించినా ఆమె వినకుండా దాసరి ఇంటి వద్దే ఉండేదట.
దీంతో చేసేదేమీ లేక దాసరి నారాయణ రావు తన వద్ద ఉన్న డ్రైవర్ తో ఆమెకు పెళ్లి చేయించాడట. ఈ పెళ్లి తరువాత ఆమె కొంతకాలం సంతోషంగా జీవించిందట. అప్పట్లో ఈమె గురించి అడగగా ఈ వివరాలను దాసరి బయటపెట్టారు. అయితే దాసరి నారాయణ రావుమరణించడంతో ఆమె గురించి బయట ప్రపంచానికి తెలియకుండానే పోయింది. దీంతో ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనే వివరాలు తెలియరావడం లేదు.