Photo Story: సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లుగా రాణించడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఇక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ తమను తాము ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్లు కూడా దొరకాలి. మంచి క్యారెక్టర్లు పడినప్పుడే ఇక్కడ హీరోయిన్లు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంటారు. ఇక అవకాశాలు లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవడం పక్క…
అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇక్కడ స్టార్ హీరోయిన్లు గా గుర్తింపు తెచ్చుకొని వాళ్ళు చేసే ప్రతి పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తూ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే పైన ఫోటోలో ‘కరాటే కిడ్’ గా ఒకరు కనిపిస్తున్నారు. అయితే ఆవిడ కరాటే కిడ్ కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి.. ఇక ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక ఇంతకీ ఆమె ఎవరు అంటే సమంత…
2010 వ సంవత్సరంలో నాగచైతన్య హీరోగా వచ్చిన “ఏ మాయ చేశావే” సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో అప్పటినుంచి తను వెనుతిరిగి చూడకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక మొత్తానికైతే తను చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించాయి… అలాగే ఆమెకు ఉన్న క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ పోవడం వల్ల ఆమె చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వ్యవహారం జరిగి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరికి వారు ఇండివిజువల్ గా బతుకుతున్నారు. ఇక డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి వరుస సినిమాలకి కమిట్ అయి మంచి సినిమాలు చేసే ప్రాసెస్ లో ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటిస్తుంది.
ఇక సూపర్ హిట్ సిరీస్ అయిన ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించడానికి రెడీ అవుతుంది. ఇక మొత్తానికైతే 15 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని సుదీర్ఘంగా కొనసాగిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఈ ముద్దుగుమ్మ బర్త్ డే కావడం వల్ల ఆమెకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…