Homeఎంటర్టైన్మెంట్Photo Story: స్టార్‌ కమెడియన్‌తో ఉన్న ఈయన ఎవరో తెలుసా? వైరల్‌ అవుతోన్న వీడియో

Photo Story: స్టార్‌ కమెడియన్‌తో ఉన్న ఈయన ఎవరో తెలుసా? వైరల్‌ అవుతోన్న వీడియో

తీన్మార్‌ మల్లన్న నాయకుడిగా కన్నా జర్నలిస్టుగానే చాలా మందికి తెలుసు. టీవీ ఛానెళ్లలో చేసిన తర్వాత క్యూ న్యూస్‌ పేరిట యూట్యూబ్‌ చానెల్‌ నడుపుతున్నారు. ఆయన వార్తలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి.

Photo Story: సినిమా అదో రంగుల ప్రపంచం.. ఇందులోకి అనేక మంది వస్తుంటారు వెళ్తుంటారు. కానీ కొందరే గుర్తిండిపోతారు. వారు చేసే పాత్రలు వచ్చే అవకాశాల ఆధారంగా ప్రజలకు, ప్రేక్షకులకు దగ్గరవుతారు. కానీ, కొంతంది నటించినా.. గుర్తుండరు. సమయం, సందర్భానుసారం గుర్తొస్తారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, కాంగ్రెస్‌ నేతల, కూ‍్యన్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ బాస్‌.. తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) కూడా అలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.

వేణుమాధవ్‌తో సీన్‌..
తీన్మార్‌ మల్లన్న నాయకుడిగా కన్నా జర్నలిస్టుగానే చాలా మందికి తెలుసు. టీవీ ఛానెళ్లలో చేసిన తర్వాత క్యూ న్యూస్‌ పేరిట యూట్యూబ్‌ చానెల్‌ నడుపుతున్నారు. ఆయన వార్తలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు ఆయన స్టార్‌ కమెడియన్‌ వేణుమాధవ్‌తో ఓ సినిమాలో చేసిన సన్నివేశం సోషల్‌ మీడియాలో వైరల్‌ అఅవుతోంది. న్యూస్‌ రీడర్‌గా ఉన్న సమయంలోనే ఆయన కొన్ని సినిమాల్లో చేశారు. ఇప్పుడు వైరల్‌ అవుతున్న కామెడి సీన్‌ మాత్రం శ్రీమతి బంగారంలోనిది. రాజీవ్‌ కనకాల ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో తీన్మార్‌ మల్లన్న వేణుమాధవ్‌తో కలిసి కొన్ని సన్నివేశాల్లో కనిపించారు.

పాత పరిచయంతో..
వేణుమాధవ్‌కు తీన్మార్‌ మల్లన్న మంచి మిత్రుడు. ఒక రోజు షూటింగ్‌ చూసేందుకు వెళ్లాడట. అదే సమయంలో వేణుమాధవ్‌ కోరిక మేరకు సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో నటించారట. తర్వాత త్రిష హీరోయిన్‌గా నటించిన ఓ సినిమాలోనూ తీన్మార్‌ మల్లన్న కనిపిచారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper