Balakrishna vs Akkineni Family : ఇటీవల జరిగిన ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ అదుపు తప్పి మాట్లాడిన కొన్ని మాటలు పెద్ద వివాదాలకు దారితీశాయి.. ‘అక్కినేని తొక్కినేని’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా నెటిజెన్స్ కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు..అక్కినేని నాగేశ్వరరావు గారి వర్థంతి రోజున ఇలా మాట్లాడడం బాలకృష్ణ కుసంస్కారానికి నిదర్శనం అంటూ బాలయ్య పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
‘అన్ స్టాపబుల్’ షోతో తానూ ఎంతో సౌమ్యుడని, అందరితో స్నేహపూర్వక వాతావరణంలో ఉంటానని బాలయ్య చేసిందంతా నటనే అని అంటున్నారు విశ్లేషకులు.. తెలుగు కళామతల్లికి రెండు కళ్ళలో ఒకరైన నాగేశ్వరరావు గారిని ఆయన కుటుంబాన్ని ఇంతలా నలుగురిలో అవమానించడాన్ని ఏమాత్రం సహించబోమని.. తక్షణమే బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మేము తలపట్టే కార్యక్రమాలకు బాలయ్య చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఒక బహిరంగ లేఖ ద్వారా బాలయ్యకి వార్నింగ్ ఇచ్చారు.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
దీనిపై నాగేశ్వరరావు మనవళ్లు అక్కినేని నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ తమదైన శైలిలో సమాధానం చెప్పారు.. ఈ సందర్భంగా ట్విట్టర్ లో వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.. ‘నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎస్వీ రంగారావు తెలుగు సినీ పరిశ్రమకి గర్వకారణం లాంటి వాళ్ళు.. తెలుగు కళామతల్లికి ముద్దు బిడ్డలు.. అలాంటి వాళ్ళని అగౌరవపర్చడం మనల్ని మనం కించపరుచుకోవడమే’ అంటూ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసారు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.. కానీ అక్కినేని నాగార్జున మాత్రం బాలయ్య వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు.. ఆయన రియాక్షన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు..రోజు రోజుకి సీరియస్ గా మారుతున్న ఈ వివాదానికి బాలయ్య క్షమాపణలు చెప్పి ఫులుస్టాప్ పెడుతాడా లేదా అనేది చూడాలి.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023