Balakrishna: ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో దీని కోసం ప్రతి ఒక్కరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక గత 3 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో చాలాకాలం తర్వాత బాలయ్య బాబు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ను అందుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఆయన తన సినిమాల పట్ల చాలా ఆచితూచి ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే బాబీ కూడా బాలయ్య ను ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కనక మనం చూసుకున్నట్లైతే ఈ విషయం మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి బాలయ్య తో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.. ఇక మిగిలిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్లు అవ్వడంతో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే నాలుగో సినిమా పైన విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక బాలయ్య బాబు అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద చాలా వరకు బజ్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇక బోయపాటి తన గత చిత్రమైన స్కంద తో అంతగా మెప్పించినప్పటికీ బాలయ్య బాబుతో ఆయన చేసే సినిమా మీద మాత్రం అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే బోయపాటి వేరేవాళ్ళతో ఎలాంటి సినిమా చేసినప్పటికి బాలయ్య బాబు దగ్గరికి వచ్చేసరికి మాత్రం తనకు ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని ఇవ్వడానికి తను అహర్నిశలు కష్టపడతాడు అంటూ సినిమా మీద చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు అనే విషయం మీద చాలా వార్తలైతే వస్తున్నాయి.
అయితే ఆ యంగ్ హీరో కూడా కిరణ్ అబ్బవరం కావడం విశేషం. ఇక ఆ హీరో కూడా బాలయ్య బాబుతో నటించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. ఎందుకంటే స్వతహా గా కిరణ్ అబ్బవరం కూడా బాలయ్య బాబు అభిమాని కావడం వల్ల తను ఈ విషయం మీద స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య బాబు లాంటి ఒక స్టార్ హీరో సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చిన నేను చేస్తాను అంటూ తను రీసెంట్ గా తెలియజేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Young hero who is getting ready for a movie with balakrishna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com