Social Trends: సమాజం అలా తయారైంది.. అనాధిగా తల్లిదండ్రుల విషయంలో ఆడబిడ్డలు.. మగ పోరగాళ్లు వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా ఉంటుంది. ఆడబిడ్డలు తల్లిదండ్రులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే.. ఈ మగ కొడకులు మాత్రం తల్లిదండ్రులను కాలదంతున్న పరిస్థితులను పేపర్లలో, మీడియాలో ఎన్నో చూశాం.. ఇంకా చూస్తూనే ఉన్నాం..
ఇంటికి దీపం ఇల్లాలు అన్నది నానుడి.. ఆ ఇంటికి బంగారు తల్లులు ఆడపిల్లలే. ఆడపి ల్ల వద్దు అని కాలదన్ని కొడుకులే కావాలన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆ కొడుకు సాకలేక ఎంతో మందిని వృద్ధాశ్రమాల్లో వేసి హింసించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆడబిడ్డలు మాత్రం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అక్కున చేర్చుకుంటున్నారు.. ఆదరిస్తున్నారు.
మన సమాజంలో కొడుకు వారసత్వానికి, ఆస్తులకు కావాలి.. కానీ ప్రేమ పంచడానికి కాదు అన్నట్టుగా తయారైంది. అదే కూతురు ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా బోలెడంత ప్రేమను పంచుతుంటుంది. అలాంటి బంగారు తల్లులు ఎంతో మంది ఉన్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది తల్లిదండ్రులపై అమ్మాయిల ప్రేమ ఎంత స్వచ్ఛమో తేటతెల్లమవుతోంది. అదే అబ్బాయిల ప్రేమ ఎంత అనుమానమో అన్నది తెలియజెపుతోంది. అయితే అందరి అబ్బాయిల ప్రేమను తల్లిదండ్రులు అనుమానించకున్నా.. సమాజంలో మెజార్టీ ప్రజల అభిప్రాయం మాత్రం అదే. అబ్బాయిల ప్రేమ కంటే తల్లిదండ్రులపై అమ్మాయిల ప్రేమే విశ్వసనీయమైనది తేలింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.