Geetu Royal sensational comments on love
Geetu Royal: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె ప్రేమికులకు ఒక సలహా ఇచ్చింది. అదేమిటో చూద్దాం. బిగ్ బాస్ రివ్యూవర్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన గీతూ రాయల్ సీజన్ 6 లో కంటెస్ట్ చేసింది. హౌస్లో అమ్మడు రచ్చ రచ్చ చేసింది. గీతూ కేంద్రంగా బిగ్ బాస్ ఆట ఆడేవాడు. ప్రతి విషయాన్ని ఆమెతో ముడిపెట్టేవాడు. హౌస్లో తానే తోపు అనే ఫీలింగ్ కి గీతూ రాయల్ వెళ్ళింది. ఒక దశలో గీతూ రాయల్ బిగ్ బాస్ రోల్స్ కూడా మార్చేసి తన రూల్స్ అమలు చేయడం మొదలుపెట్టింది.
నాగార్జున(Nagarjuna) వార్నింగ్ ఇచ్చాక కూడా గీతూ మారలేదు. 9వ వారం గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యింది. నేను వెళ్ళను అంటూ చిన్న పిల్ల మాదిరి ఏడ్చేసింది. అసలు తాను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని గీతూ రాయల్ ఆవేదన చెందింది. కాగా సీజన్ 7 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా మారి మరలా వెలుగులోకి వచ్చింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని గీతూ రాయల్ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది.
కాగా ఫినాలే రోజు గీతూ రాయల్ కారుపై కొందరు దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి భయాందోళనలకు గురి చేశారు. తనపై దాడి చేసిన వాళ్ళ మీద గీతూ రాయల్ కేసు పెట్టింది. వాళ్ళను పట్టిస్తే డబ్బులు ఇస్తానని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్స్ చేసింది. ఇదిలా ఉంటే… ప్రేమ మీద గీతూ రాయల్ ఓ అభిప్రాయం వెల్లడించింది. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. అసలైన ప్రేమ ఏమిటో ఆరు నెలల వరకు కూడా తెలియదట. అబ్బాయి, అమ్మాయి మధ్య మొదట్లో ఉండేది కేవలం వ్యామోహం మాత్రమే అట.
జరగాల్సిన వన్నీ జరిగిపోయాక బోర్ కొట్టేస్తుందట. కొత్త వాళ్ళను వెతుక్కుంటారట. ఆరు నెలల తర్వాత కూడా ఒకరి మీద మరొకరికి ఇష్టం అలానే ఉంటే… అది నిజమైన ప్రేమ అని గీతూ రాయల్ చెప్పుకొచ్చింది. కాబట్టి తొందర పడి ఒక అభిప్రాయానికి రావద్దంటూ ఆమె ప్రేమికులకు ఒక ఉచిత సలహా విసిరింది. గీతూ రాయల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఎదురైందా? అని గీతూ రాయల్ ని నెటిజెన్స్ అడుగుతున్నారు.
Web Title: Bigg boss fame geetu royal sensational comments on love and relationship