Akhanda Movie:నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకొని ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది.
ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసిన విషయం మనకు తెలిసిందే.ఇందులో బాలకృష్ణ తల్లి పాత్రలో నటించిన ఆమె పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎంతగానో ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే బాలక్రిష్ణ తల్లి పాత్రలో నటించిన ఆమె ఎవరు ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు.
అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రలో నటించిన నటి పేరు విజి చంద్రశేఖర్. ఇక ఆమె గురించి చెప్పాలంటే ఆమె భర్త ఒక ఎయిర్ ఇండియాలో మోస్ట్ సీనియర్ రిటైర్డ్ కెప్టెన్ అని ఈనటి తెలిపారు. తనభర్త రిటైర్ అయినప్పటికీ ఇంకా ఎయిర్ ఇండియాలోనే పని చేస్తున్నారని ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో విజి చంద్రశేఖర్ వెల్లడించారు. ఇకపోతే తాను నెలలో కేవలం పన్నెండు రోజులు మాత్రమే పని చేస్తానని ఇక పూర్తిగా తన కుటుంబం పై శ్రద్ధ చూపిస్తూ కుటుంబ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు.
తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని అందులో ఒకరు డాక్టర్ కాగా మరొకరు యాక్టర్ అని ఈమె వెల్లడించారు. తన భర్త కెప్టెన్ కావడంతో ఒక అతిథి లాగా తన ఇంటికి వచ్చి వెళ్లే వారని ఈ క్రమంలోని పిల్లల పూర్తి బాధ్యతలు తీసుకోవడం వల్ల తక్కువ సినిమాల్లో నటించాల్సి వచ్చిందని తెలిపారు. పిల్లలకు సంబంధించి ఏ ఫంక్షన్ అయినా తాను మాత్రమే వెళ్లే దానిని చిన్నప్పుడు పిల్లల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే పెద్దయ్యాక బాధపడాల్సిన అవసరం ఉండదని అందుకోసమే తన సినిమాలలో కన్నా ఎక్కువ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ బాధ్యతలను తీసుకున్నానని విజీ చంద్రశేఖర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Do you know who she is played the role of balakrishna mother in the movie akhanda
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com