Chiranjeevi
Daddy Movie Child : సినిమా ఇండస్ట్రీ ఏదైనా కూడా మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్లుగా ఎదిగిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరో,హీరోయిన్ గా రాణిస్తున్న వారు ఉన్నారు.అయితే మరికొంత మంది మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా కూడా వాళ్ళు తమ నటనతో ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతారు.వాళ్ళు నటించిన సినిమాలు ఏవైనా టీవీ లో ప్రసారం అయితే ఈ చిన్నారి ప్రస్తుతం ఎలా ఉందో..ఏం చేస్తుందో అని అందరు అనుకుంటారు.ఈ క్రమం లోనే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా మొత్తం గాలిస్తారు.
అలా ఒక్క సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే వాళ్లలో డాడీ సినిమా చిన్నారి కూడా ఉంది అని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి తన కెరీర్ లో నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో డాడీ సినిమా కూడా ఒకటి.2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి కు జోడిగా సిమ్రాన్ హీరోయిన్ గా చేసింది.అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాలో ఒక చిన్నారి తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు అని చెప్పచ్చు.అయితే ఈ కథను రచయిత భూపతి రాజా మొదట చిరంజీవి గారికి వినిపించినప్పుడు ఆయన ఈ కథకు హీరో వెంకటేష్ అయితే సరిపోతాడు అని చెప్పారట.
కానీ భూపతి రాజా మాత్రం చిరంజీవి గారికి ఈ కథ చాలా డిఫరెంట్ గా వెరైటీ గా ఉంటుంది అని చెప్పి ఒప్పించారట.ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ కూడా సినిమా చూసి అదే మాట చిరంజీవి గారికి చెప్పారట.ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి తన క్యూట్ క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో ప్రసారం అయితే ఈ చిన్నారి ప్రస్తుతం ఎలా ఉందో…ఏం చేస్తుందో అని అందరు అనుకుంటారు.ఈ సినిమాలో నటించిన చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా.ఈమె ముంబై కు చెందిన అమ్మాయి.తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో డాడీ సినిమా లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అయితే ఈ సినిమాలో అనుష్క మెగాస్టార్ చిరంజీవి కూతురిగా నటించే అవకాశాన్ని కొట్టేసింది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి,ఆ చిన్నారికి మధ్య ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాన్ని తాకాయి అని చెప్పచ్చు.డాడీ సినిమాలో తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన అనుష్క మల్హోత్రా ఆ తర్వాత వేరే సినిమాలలో కనిపించలేదు.డాడీ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆమె మరొక సినిమా చేయలేదు.అనుష్క మల్హోత్రా తన దృష్టి మొత్తాన్ని చదువులపై పెట్టినట్లు తెలుస్తుంది.డాడీ సినిమాలో ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం హీరోయిన్లకు మించిన అందంగా మారిపోయింది.అనుష్క సోషల్ మీడియా లో కూడా అంతగా ఆక్టివ్ గా ఉండదు అని తెలుస్తుంది.కానీ అప్పుడప్పుడు ఆమెకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయి.ప్రస్తుతం అనుష్క మల్హోత్రా గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో అందరిని ఆకట్టుకుంటున్నాయి.