Viral News : మనుషులకు జంతువులు, పక్షలకు విడదీయరాని అనుబంధం ఉంది. మనం పుట్టిందే కోతి నుంచి అన్నది వాస్తవం. అందుకే కాబోలు విశ్వంలో జంతువులు మనుషులతో అనుబంధం ఏర్పర్చుకుంటాయి. ఈ క్రమంలోనే అనాదిగా మనుషులు కూడా జంతువులను మచ్చిక చేసుకుని పెంచుతున్నారు. కరోనా తర్వాత నుంచి చాలా మంది పెట్స్ పెంపకంపై దృష్టిపెట్టారు. ఒంటరిగా జీవించకుండా, పెట్స్‌ను తోడుగా ఉంచుకుంటున్నారు.
మాట్లాడే పక్షులు, మాట వినే జంవుతులు..
ఇదిలా ఉంటే.. మనం పెంచుకునే పక్షులు, జతువులు యజమాని మాట విడనం సహజం. చిన్పప్పటి నుంచి వాటిని పెంచి పోషించడం వలన అవి కూడా యజమానిపై ప్రేమ చూపుతాయి. చెప్పినట్లు చేస్తాయి. అందుకే పక్షలు చిన్న చిన్న పదాలు పలకడం, ఆవు, కుక్క, పిల్లి, మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి జంతువులు కూడా యజమానులు చెప్పినట్లు చేస్తాయి.
ఇక్కడ కోడి కూడా..
సాధు జంతువులు యజమానుల మాట వినడంలో కొత్తదనం ఏమీలేదు. కానీ, ఇక్కడ ఓ కోడి కూడా యజమాని చెప్పినట్లు నడుచుకుంటోంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్క చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి కోళ్ల ఫారం ద్వారా ఉపాది పొందుతున్నాడు. ఈ ఫారంలో ఓ కోడి యజమాని చెప్పినట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కుక్కలు, పిల్లులు, ఆవులు యజమాని చెప్పినట్లు వినడం మనం చేసే ఉంటాం. కానీ, ఇక్కడ కడక్నాగ్ జాతి కోడి.. యజమాని మల్లారెడి చెప్పిన మాట వింటోంది. ముదుకు వెళ్లమంటే ముందుకు, వెనక్కు రమ్మంటే వెనక్కు, పైకి ఎగరమంటే పైకి ఎగురుతుంది. కోడికి మెదడు తక్కువగా ఉంటుంది. ఆలోచనా శక్తి ఉండదు. అయినా ఈ కోడి మాత్రం యజమాని మాట వింటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More