Prabhas : సినిమా ఇండస్ట్రీ లో సౌత్ నుంచి నార్త్ వరకు నెంబర్ వన్ స్టార్ హీరో అంటే అందరికి గుర్తొచ్చే పేరు ప్రభాస్.ఇంతటి క్రేజ్ మరియు డిమాండ్ ఉన్న ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది అని అందరు ఊహించగలరు.హీరో ప్రభాస్ తన సినిమాలకు ఇప్పటి వరకు 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.తాజాగా ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను పెంచి అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు అని ఫిలిం నగర్ లో ఒక వార్త హల్ చల్ చేస్తుంది.డార్లింగ్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి సినిమాతో రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ఫీవర్ కొనసాగుతుంది అని చెప్పడం లో ఆశ్చర్యం లేదు.
ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా 500 కోట్లు కలెక్షలు రాబట్టడం ఖాయమని నమ్ముతున్నారు నిర్మాతలు.నిజానికి ఇది చాల చిన్న టార్గెట్ అని చెప్పచ్చు.ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే పరిస్థితి ఏర్పడింది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లేటెస్ట్ గా రెండు 1000 కోట్ల మూవీలను సాధించారు.డార్లింగ్ సినిమాకు డిజిటల్ రైట్స్ కే 400 కోట్లు పలుకుతాయి.ఇక ఆయన సినిమాకు థియరిటికల్ రైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.ఇంతటి డిమాండ్ మరియు క్రేజ్ ఉన్న హీరో రెమ్యూనరేషన్ 150 కోట్లు అంటే ఆయన రేంజ్ కు చాలా తక్కువ అని తెలుస్తుంది.హీరో విజయ్ ఇప్పటికే గోట్ సినిమాకు 180 పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది.గోట్ సినిమా ముందు వరకు హీరో విజయ్ 120 నుంచి 150 కోట్లు పారితోషకం అందుకోవడం జరిగింది.అయితే గోట్ సినిమా తన చివరి సినిమా అని,ఇక ఈ సినిమా తర్వాత రానున్న రోజుల్లో విజయ్ సినిమాలు చేయనని ప్రకటించి తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేయడం జరిగింది.
ఈ సినిమా తర్వాత హీరో విజయ్ తన దృష్టి మొత్తాన్ని రాజకీయాలపై సారిస్తున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో 180 కోట్లు అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరో విజయ్ అని చెప్పచ్చు.ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ప్రస్తుతం ప్రభాస్ నెంబర్ వన్ హీరో గా క్రేజ్ తెచ్చుకున్నారు.దాంతో ఆయన తన పారితోషకాన్ని మరో 50 కోట్లు పెంచి రౌండ్ ఫిగర్ 200 కోట్లు చేసినట్లు తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమాకు 80 కోట్లు పారితోషకం అందుకున్నారు.కల్కి తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలు రాజా సాబ్,స్పిరిట్ లకు 150 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం.అయితే ఈ లోపే డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్ల ప్రభంజనం సృష్టించటం తో ప్రభాస్ తన పారితోషకాన్ని పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకు 200 కోట్లు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం.నిజంగా ప్రభాస్ కనుక 200 కోట్లు పారితోషకం అందుకుంటే సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకునే నెంబర్ వన్ హీరో గా ప్రభాస్ పేరు టాప్ లో ఉంటుంది.అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్,ఫాలోయింగ్ ను దృష్టి లో పెట్టుకొని నిర్మాతలు కూడా ప్రభాస్ కు అడిగినంత పారితోషకం ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు అని తెలుస్తుంది.తాజాగా కల్కి సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రభాస్ రాజా సాబ్,స్పిరిట్ సినిమాలతో ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాల్సిందే.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Do you know the remuneration of hero prabhas after kalki
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com