Star Directors
Star Directors: సినిమా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న కొంతమంది సీనియర్ దర్శకులు ప్రస్తుతం వాళ్ళ కొడుకులను హీరోలుగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ముఖ్యంగా తేజ గురించి చెప్పాలి. ఒకప్పుడు ప్రేమ కథ సినిమాలను తీసిన తేజ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇక ఇప్పటికి కూడా ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తూ వస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ప్రస్తుతం తన కొడుకుని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన రానా తో చేస్తున్న ‘రాక్షసి రాజా’ సినిమా ఆగిపోయిందా లేదంటే షూట్ నడుస్తుందా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే తన కొడుకుని ఇప్పుడు హీరోగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన త్రివిక్రమ్ తొందర్లోనే తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు యాక్టింగ్ కు సంబంధించిన మెలకువలను నేర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ కొడుకు సినిమా అంటే మామూలుగా ఉండదు కాబట్టి త్రివిక్రమ్ కథ మాటలను రాసి వేరే కొత్త డైరెక్టర్ తో ఈ సినిమా డైరెక్షన్ చేయించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఒకటి రెండు సినిమాలు వేరే డైరెక్టర్లతో చేసిన తర్వాత అప్పుడు త్రివిక్రమ్ అతనితో ఒక మంచి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే త్రివిక్రమ్ కొడుకు ఇండస్ట్రీకి రావడానికి ఇంకా 2, 3 సంవత్సరాలు పట్టే అవకాశాలైతే ఉన్నాయి…ఇక వీళ్లు కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలతో పాటు పోటీపడి మరి మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఈ దర్శకుల అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి తేజ, త్రివిక్రమ్ ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటూ తమకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ బ్రాండ్ ను వాళ్ళ కొడుకులు కూడా సంపాదించుకుంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…