Shubhashree
Shubhashree: బిగ్ బాస్ భామ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. నటిగా కొనసాగుతూనే కోట్లు సంపాదించే మాస్టర్ ప్లాన్ చేసింది. అమ్మడు తెలివితేటలకు ఫ్యాన్స్ అవాక్కు అవుతున్నారు. ఈ రోజుల్లో ఒక పని చేస్తూ రీలాక్స్ అయితే సరిపోదని అంటున్నారు. ఆమె ఎవరో కాదు శుభశ్రీ రాయగురు. ఈమె వృత్తిరీత్యా లాయర్. అయితే మోడలింగ్ మీద కూడా ఆసక్తి ఉంది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ మిస్ ఒరిస్సా టైటిల్ సొంతం చేసుకుంది.
అనంతరం టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2022లో విడుదలైన లోబడ్జెట్ మూవీ రుద్రవీణ లో శుభశ్రీ రాయగురు నటించింది. అది శుభశ్రీ డెబ్యూ మూవీ. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆమె నటించారు. అయితే శుభశ్రీకి ఎలాంటి ఫేమ్ దక్కలేదు. బిగ్ బాస్ సీజన్ 7లో శుభశ్రీ అవకాశం దక్కించుకుంది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. శుభశ్రీ తనదైన గేమ్ తో ఆకట్టుకుంది. వచ్చీ రాని తెలుగులో ఆమె మాటలు చాలా క్యూట్ గా ఉండేవి. ‘మనోభావాలు దెబ్బతిన్నాయంట’ అని ఆమె ఏడుస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.
శుభశ్రీ కాస్తా… మనోభావాల పాపగా ఫేమస్ అయ్యింది. కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ శుభశ్రీకి లైన్ వేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేశాడు. శుభశ్రీ కూడా అతని పట్ల సాఫ్ట్ గా వ్యవహరించేది. అయితే ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదు. గౌతమ్ తో బాగా మాట్లాడేది. ఒక లైన్ మైంటైన్ చేసింది. అనూహ్యంగా శుభశ్రీ నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యింది. దాంతో గౌతమ్ ఫీల్ అయ్యాడు.
శుభశ్రీకి సెకండ్ ఛాన్స్ రావాల్సింది. కానీ ఉల్టాపల్టా ఓటింగ్ వలన శుభశ్రీకి దక్కాల్సిన ఛాన్స్ రతికా రోజ్ కి దక్కింది. దాంతో శుభశ్రీ కంటే ముందు ఎలిమినేట్ అయిన రతిక రోజ్ తిరిగి హౌస్లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీతో శుభశ్రీ సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ మూవీలో శుభశ్రీ ఓ కీలక పాత్ర చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
అయితే ఓజీ షూటింగ్ కి బ్రేక్ పడింది. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొంచెం ఫ్రీ అయ్యాక పెండింగ్ లో ఉన్న చిత్రాల షూటింగ్స్ పూర్తి చేస్తారు. ఆయన ముందుగా ఓజీ సెట్స్ లో అడుగుపెడతారనే వాదన నడుస్తుంది. ఓజీ విడుదలైతే శుభశ్రీ కెరీర్ కి ప్లస్ కావచ్చు. ఓజీ విడుదల కోసం ఫ్యాన్స్ తో పాటు శుభశ్రీ రాయగురు కూడా ఎదురు చూస్తుంది.
కాగా జులై 15న శుభశ్రీ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యాపారంలో అడుగుపెట్టింది. శుభశ్రీ హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్, విల్లా, అపార్ట్మెంట్… ఇలా ఏది కావాలన్నా.. శుభశ్రీ హోమ్స్ ని సంప్రదించండి అని వీడియోలో వెల్లడించింది. రియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలతో కూడిన వ్యాపారం. అలాగే రిస్క్ కూడా ఎక్కువే.
నటిగా కొనసాగుతూనే ఓ రిస్కీ బిజినెస్ లో శుభశ్రీ రాయగురు అడుగుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. వ్యాపారంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. లాయర్ గా అనేక మెళకువలు తెలిసిన శుభశ్రీ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక శుభశ్రీ బర్త్ డే పార్టీకి తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు.
Web Title: Bigg boss beauty shubhashree is busy in real estate business
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com