Homeఆంధ్రప్రదేశ్‌Balakrishna: హోంమంత్రి అనితకు వార్నింగ్ కు ఇచ్చిన బాలయ్య.. కారణం అదే.. సీఎం వద్దకు పంచాయితీ

Balakrishna: హోంమంత్రి అనితకు వార్నింగ్ కు ఇచ్చిన బాలయ్య.. కారణం అదే.. సీఎం వద్దకు పంచాయితీ

Balakrishna: అమరావతి : ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే కొంతమంది ఎమ్మెల్యేల ఓవరాక్షన్ వెలుగు చూస్తోంది. మొన్న ఆ మధ్యన ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిన విషయమే. రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ హరితారెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. నేరుగా మంత్రిని హెచ్చరించారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే సత్వర న్యాయం పేరిట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు మరువక ముందే.. ఏకంగా హోం శాఖామంత్రి వంగలపూడి అనిత పై.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. క్యాబినెట్ లో చోటు దక్కకపోయినా.. అంతకుమించి హోదా వెలగబెడతారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ బాలకృష్ణ మాట ఇట్టే చెల్లుబాటు అవుతుంది. బావ చంద్రబాబు సీఎం కాగా, అల్లుడు లోకేష్ మంత్రి. నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ టిడిపి. ఇది చాలదా.. బాలకృష్ణ హవా చాటడానికి. అయితే హోంమంత్రి వంగలపూడి అనిత అనుచరులు.. బాలకృష్ణ సన్నిహితులకు కెలకడంతో వివాదంగా మారింది. ఏకంగా అనితకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చేదాకా పరిస్థితి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది.

అన్నవరంలో వన్ అనే ప్రఖ్యాత హోటల్ ఒకటి ఉంది. నిత్యం సందర్శకులతో బిజీగా ఉంటుంది. ఇటీవల పాయకరావుపేటకు చెందిన టిడిపి నేతలు ఆ హోటల్ కు వెళ్లారు. అయితే అప్పటికే సందర్శకులతో రద్దీగా ఉంది హోటల్. కానీ టిడిపి నేతలు కొద్దీ అక్కడే ఉండిపోవడంతో.. సిబ్బంది వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి నేతలు సిబ్బందితో వాగ్వవాదానికి దిగారు. యాజమాన్య ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు. సిబ్బందిపై దాడి చేయడంతో వారు అమెరికాలో ఉన్న యజమానికి సమాచారం అందించారు. ఆయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. జరిగిన విషయాన్ని చెప్పడంతో వెంటనే స్పందించిన బాలకృష్ణ మంత్రి అనిత కు ఫోన్ చేశారు. టిడిపి నేతలను నియంత్రించాలని సూచించారు.అయినా ఈ గొడవ సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్లినట్లు సమాచారం. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular