Guess Actress: ఒకప్పుడు తెలుగు చిత్ర సీమను చిన్న చూపు చూసేవారు. కానీ ఎంతో మంది వివిధ రాష్ట్రాలనకు చెందిన యువతీ, యువకులకు అవకాశాలు ఇచ్చి వారికి గుర్తింపు రావడానికి కారణమైంది. ప్రస్తుతం వరల్డ్ లెవల్లో టాలీవుడ్ పేరు మారుమోగుతోంది. తెలుగులో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. తమ జీవితం మారిపోతుందని అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలా తెలుగు సినిమా ఛాన్స్ కోసం నార్త్ భామలు సైతం క్యూ కట్టారు. ఆ కోవలోనే యూపీకి చెందిన ఓ బ్యూటీ తెలుగులో అవకాశం తెచ్చుకొని ఆ తరువాత స్టార్ అయింది. అయితే ఆ సమయంలో ఎంతో ముద్దు ముద్దుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది.. అప్పటికీ, ఇప్పటికీ ఎంతో మార్పు చెందిన ఈ భామ ఎవరో తెలుసా?
కొన్ని తెలుగు సినిమాల్లో అంతగా ఆకట్టుకోకపోయినా అందులో నటించిన వాళ్లు మాత్రం ఫేమస్ అవుతారు. కొత్త వారికి అవకాశం ఇచ్చే లేడీ డైరెక్టర్ జయ.. తన ‘లవ్ లీ’ సినిమా ద్వారా కూడా నార్త్ అమ్మాయి ‘శాన్వీ శ్రీ శాత్సవ’ కు కూడా అవకాశం ఇచ్చారు. ఈ పేరు చెప్పేకంటే ‘లవ్ లీ’ సినిమా పేరు చెప్పగానే ఆ హీరోయిన్ గుర్తుకు వస్తుంది. ఇందులో హీరోయిన్ ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. అమాయకమైన తన నటనతో సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె నటించిన ఈ ఒక్క సినిమాతోనే సినీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘అడ్డా’, ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమాల్లో కనిపించింది. ఆ తరువాత తెలుగు సినిమాల జోలికి వెళ్లలేదు.
Also Read: ఆ హీరోయిన్ బాలయ్యకు తల్లి కాని తల్లి అయ్యింది… తండ్రి ఎన్టీఆర్ అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?
శాన్వీ శ్రీ శాత్సవ తెలుగు నటించిన తరువాత ఫేమస్ అయింది. దీంతో వివిధ భాషల నుంచి ఆఫర్లు వచ్చాయి. దీంతో కన్నడంలో ‘చంద్ర లేఖ’, ‘మాస్టర్ పీస్’, ‘ భలే జోడి’, ‘ సందరంగా జానా’, ‘సహేబా’, ‘అవనే శ్రీమన్నారయణ’ అనే సినిమాల్లో నటించి ఫేమస్ అయింది. అయితే 2014 తరువాత తిరిగి తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి అఫర్లు దక్కలేదు. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు హాట్ హాట్ పిక్స్ తో అలరిస్తోంది. లేటేస్టుగా ఆమె అందాలు వరదలా పారించింది. ఒకప్పుడు క్యూట్ గా కనిపించిన ఈమె ఇప్పుడు హద్దు పద్దు లేకుండా గ్లామర్ షో చేయడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రస్తుతం లవ్ లీ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. కన్నడంలో ఆమె త్రిశూలం సినిమాలో నటిస్తోంది. మరోవైపు మరాఠీలో రాంతీ అనే సినిమాలో కనిపించనుంది. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా అందాల పరదను తెంచేసి నెట్టింట పిక్స్ పెట్టడంపై కొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తం జీన్స్ డ్రెస్ లో కనిపిస్తూ కుర్రకారును పిచ్చోళ్లను చేస్తున్న ఈమెను చూసి ఇలా మారిపోయిందేంటి? అంటున్నారు. ఒకప్పడు పక్కింటి అమ్మాయిలా కనిపంచిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లెవల్లో మారిపోవడం చూసి షాక్ అవుతున్నారు.
అయితే ఈ పిక్స్ ను అమ్మడు ఎందుకు పోస్టు చేసిందో మాత్రమే చెప్పలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా దర్శనం ఇవ్డానికి కారణమేంటి? అని కొందరు మెసేజ్ లు పెడుతున్నా.. స్పందన లేదు. ఏదీ ఏమైనా ఈ బ్యూటీ ఇలా మారిపోవడంపై సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. మరి ఇప్పటికే ఈమె తెలుగులో ఆఫర్ తెచ్చుకుంటుందా? లేదా? అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: చిరంజీవి ఎందుకు ఆ సినిమాను వదిలేశాడో తెలుసా..? ఆ సినిమాతో మోహన్ బాబు స్టార్ హీరో అయిపోయాడుగా…
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Shanvi srivastava latest photo goes viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com