Canada : ప్రపంచ నేరస్థులకు స్వర్గ ధామంగా మారిన కెనడా
నాజీ యుద్ధ నేరస్థులు, నరహంతకులు సురక్షితంగా సెటిల్ అయినటువంటి ప్రాంతం ఏంటంటే అది కెనడా అని తేల్చింది.
Canada : కెనడా.. జీ7 సభ్యదేశాల్లో ఒకటి. జీ7 అంటే ప్రజాస్వామ్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. పర్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న దేశాలు. జీ7లో జపాన్ లాంటి దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి మేమే మూలం అని చెప్పుకునే దేశాల్లో ఒకటి. ఇటీవల కెనడా ఎందుకు పేరుమోగుతోందంటే.. అమెరికా తర్వాత భారతీయులు కెనడాకే ఎక్కువ వెళుతున్నారు. ఉద్యోగాలు కల్పనలో అమెరికా, ఆస్ట్రేలియాతోటి సమానంగా నిలిచింది.
అయితే ఎంత రాజకీయంగా ఖలిస్తాన్ కు కెనడా మద్దతిచ్చినా కూడా భారత్ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ నిజ్జర్ అనే ఖలిస్తాన్ టెర్రరిస్ట్ ను భారత్ చంపింది అని అనడంతో కెనడా పరువు పోయింది. కెనడా నాణేనికి రెండో కోణం చూస్తే అది ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు.. ప్రపంచంలోని నేరస్థులు అందరూ సురక్షితంగా నివసించడానికి వలస వెళుతున్న దేశం ‘కెనడా’.
మూడు దశాబ్ధాల క్రితం నుంచి చూస్తే 1000 మంది యుద్ధ నేరస్థులు కెనడాలో తలదాచుకుంటున్నారు. ఇటీవల జస్టిస్ జులిస్ 85-86లో ఒక నివేదిక ఇచ్చాడు. సుమారు 1000 మంది యుద్ధ నేరస్థులకు కెనడా నివాసంగా ఉంది. నాజీ యుద్ధ నేరస్థులు, నరహంతకులు సురక్షితంగా సెటిల్ అయినటువంటి ప్రాంతం ఏంటంటే అది కెనడా అని తేల్చింది.
ప్రపంచ నేరస్థులకు స్వర్గధామంగా మారిన కెనడాపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
