Pavithra Jayaram
Pavithra Jayaram: బుల్లితెర నటి పవిత్ర జయరాం ఇటీవల కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సీరియల్ లో తిలోత్తమ గా తనదైన నటనతో మెప్పించింది. అలాంటి నటి రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడం అభిమానులను కలచివేస్తుంది. అయితే ఆమె గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా ఆమెకు ఒక చిరకాల కల ఉందని, ఎప్పటికైనా అది నెరవేర్చుకోవాలని పవిత్ర జయరాం చెప్పారు. కారు యాక్సిడెంట్ లో మరణించక ముందు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఇండస్ట్రీలో అడుగు పెడతానని, ఓ నటిని అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆర్థిక పరిస్థితులు, నోట్లోకి నాలుగు వేళ్ళు వెళితే చాలు అన్న ఆలోచనలు ఈ వైపు నడిపించాయి. దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను.
ఆ తర్వాత నటిగా మారాను. పాటలను డైరెక్ట్ చేయడం ప్రారంభించాను. తెలుగు రాక ఎంతో ఇబ్బంది పడ్డ నేను ఇప్పుడు తెలుగులోనే సాంగ్స్ డైరెక్ట్ చేస్తున్నాను. ఎలాంటి ప్రామ్టింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పగలుగుతున్నాను. సినిమాల్లో నటించడం నాకు ఎంతో ఇష్టం. కానీ సీరియల్స్ చేసేవాళ్లకు డేట్స్ కుదరవు. మొదట్లో నాకు యాక్టింగ్ వచ్చేది కాదు. డైరెక్టర్స్ తిట్టేవాళ్ళు .. కానీ కసితో నేర్చుకున్నాను.
త్రినయని సీరియల్ నాకు దేవుడిచ్చిన వరం. ఇక్కడే కాదు నన్ను కర్ణాటకలో కూడా తిలోత్తమ అని పిలుస్తారు. 1000 ఎపిసోడ్స్ క్రాస్ అయినా ఆ సీరియల్ లో టాప్ లో కొనసాగుతుంది. ఎప్పటికైనా డైరెక్టర్ పవిత్ర జయరాం అనే పేరు తెచ్చుకోవాలి అన్నది నా కల ఆమె తెలిపారు. కష్టంలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేస్తే .. దానికి డబుల్ మనకి తిరిగి వస్తుంది అని నమ్ముతాను. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు అని ఆమె చెప్పారు. దర్శకత్వం వహించాలన్న కల నెరవేరకుండానే ఆమె కన్ను మూసింది.
Web Title: Tv actress pavithra jayaram who died before her last breath
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com