Double Ismart Teaser
Double Ismart Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని.. ఇక అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు పూరి జగన్నాథ్…ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విశేషం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి టీజర్ ని మే 15 వ తేదీన రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే 85 సెకండ్ల పాటు సాగే ఈ టీజర్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు అనే ఒక పాయింట్ ను కూడా రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఒక్కొక్కరి క్యారెక్టర్ ఏంటి ఆయా క్యారెక్టర్లు ఏం చేయబోతున్నాయి. అలాగే రామ్ తన పాత్రలో ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వబోతున్నాడు అనే విషయాలను కూడా ఈ టీజర్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన అవుట్ లైన్ మొత్తాన్ని టీజర్ లో తెలియజేసి ఈ సినిమా మీద ఆసక్తిని పెంచే ప్రయత్నం చేయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పూరి జగన్నాథ్ సినిమా నుంచి ఒక టీజర్ వచ్చిందంటే దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనందరికీ తెలిసిందే… ఇక ఈ సినిమా మొత్తాన్ని ఆ టీజర్ లోనే చూపించే విధంగా తను టీజర్ కట్ అయితే చేస్తాడు.
ఇక అలాగే పంచ్ డైలాగులకి కేరాఫ్ అడ్రస్ గా పూరి జగన్నాథ్ నిలిచాడు. కాబట్టి ఈ సినిమా టీజర్ లో కూడా కొన్ని పంచ్ డైలాగ్ లు రిలీజ్ చేయాలనే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా ఎలా ఉంటుందో ఈ ఒక్క టీజర్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Do you know what is going to be shown in the double ismart teaser