Amazon Prime: ఓటీటీ సంస్థలకు ఇండియా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో మార్కెట్ విస్తరించాలని పలు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. కోవిడ్ ముందు వరకు ఓటీటీ సంస్థలకు ఆదరణ తక్కువే అని చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన జనాలకు ఓటీటీ సంస్థలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచాయి. దాంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె ప్రాంతాలకు చెందిన మూవీ లవర్స్ ఓటీటీ సంస్థలకు అలవాటు పడ్డారు. వరల్డ్ వైడ్ క్రియేట్ అవుతున్న విభిన్నమైన కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇండియాలో హాట్ స్టార్ అందరికంటే టాప్ లో ఉంది. ఒక్క హాట్ స్టార్ దాదాపు 5 కోట్ల సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. తర్వాత స్థానంలో జియో సినిమా ఉంది. ఇండియాకు చెందిన ఈ ఓటీటీ సంస్థకు 2.5 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మూడో స్థానంలో కొనసాగుతుంది అమెజాన్ ప్రైమ్. దీనికి 2 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హాట్ స్టార్ ని అధిగమించాలి అనేది ప్రైమ్ ప్రధాన లక్ష్యం.
భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, ఒరిజినల్ సిరీస్లు, ఇంటర్నేషనల్ సిరీస్లు అమెజాన్ ప్రైమ్ చందాదారులకు అందిస్తుంది. మార్కెట్ లీడర్ కావాలన్న దిశగా అడుగులు వేస్తున్న అమెజాన్ ప్రైమ్ కి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ప్రైమ్ ఒరిజినల్స్ హెడ్ గా పని చేస్తున్న అపర్ణ పురోహిత్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అపర్ణ పురోహిత్ అమెజాన్ ప్రైమ్ ఇండియా ఎదుగుదలకు ఎంతగానో కృషి చేశారు. ఆమె దాదాపు 8 ఏళ్లుగా సంస్థలో పని చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో అత్యంత సక్సెస్ఫుల్ సిరీస్లుగా ఉన్న ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, మీర్జాపూర్, పాతాల్ లోక్, మేడ్ ఇన్ హెవెన్, ఫర్జీ రూపొందించడం వెనుక ఆమె ప్రమేయం ఎంతగానో ఉంది. అపర్ణ పురోహిత్ ప్రైమ్ ఒరిజినల్స్ హెడ్ పోస్ట్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం… ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో ఆమె జాయిన్ అయ్యారట. ఈ కారణంగానే అపర్ణ పురోహిత్ ప్రైమ్ కి గుడ్ బై చెప్పారని సమాచారం. ఇది ఒకింత ప్రైమ్ ని దెబ్బతీసే అంశమే అని పలువురి వాదన.
Web Title: Big shock for amazon prime india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com