Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఓటింగ్ ట్రెండ్ : పట్టణాల్లో టీడీపీ కూటమి.. గ్రామాల్లో వైసీపీ.. గెలుపు...

AP Elections 2024: ఓటింగ్ ట్రెండ్ : పట్టణాల్లో టీడీపీ కూటమి.. గ్రామాల్లో వైసీపీ.. గెలుపు ఎవరిది?

AP Elections 2024: ఏపీలో పోలింగ్ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 50 శాతానికి దాటింది. ఇంకా మూడు గంటల వ్యవధి మాత్రమే ఉంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కు సమయం ఉంది. అయితే ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక ప్రారంభమైంది. ఎక్కడికక్కడే ఓటర్లు క్యూలో నిలుచొని వేచి ఉండడం కనిపించింది.అయితేగ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున పొట్టేత్తడం విశేషం. అటు పట్టణ ప్రాంతాల్లో యువత, మహిళలు క్యూ లైన్లలో బారులు తీరారు.

అయితే ఉదయం 11 గంటల సమయానికి కేవలం ఓటింగ్ 10 శాతం మాత్రమే ఉంది. మండే ఎండలు ఒక వైపు, నెమ్మదిగా పోలింగ్ జరగడం మరోవైపు ఓటింగ్ శాతం పై పడింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు బారులు తీరడం మాత్రం విశేషం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి, అర్బన్ ప్రాంతాల్లో టిడిపి హవా కనిపించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు అధికంగా ఉంటారు. వీరికి గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అందడంతో.. తప్పకుండా వైసీపీని ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం టిడిపి కూటమిదే స్పష్టమైన ఆధిక్యం అని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.

అయితే సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో ఓటర్లు అధికంగా ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో నాలుగు మండల కేంద్రాలు, మరి ఐదు వరకు మేజర్ పంచాయతీలు, ఆపై ఒకటి రెండు మున్సిపాలిటీలు తప్పనిసరిగా ఉంటాయి. అక్కడ మాత్రం టిడిపి కూటమికి ఓట్లు అధికంగా పడే అవకాశం ఉంది. విద్యాధికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులుఎక్కువగా ఉన్న తరుణంలో.. వారంతా టిడిపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.దీనికి తోడు నిత్యవసరాల ధరలు, పన్నులు,చార్జీల పెంపు వంటి అంశాలుప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వైసీపీ సర్కార్ మహిళల పేరిట పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఇప్పుడు ఎన్నికల్లో వారే ఉత్సాహంగా ఓటు వేయడానికి ముందుకు రావడం చూస్తుంటే వైసీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. మరి ఓటర్లు ఏ విధంగా తీర్పు ఇచ్చారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper