Sonu Sood: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంటే తెలియని వారెవ్వరు ఉండరనే చెప్పాలి. 10 రకాల భాషలు పైగా తన నృత్యం ప్రదర్శనలు ప్రదర్శించారు శివశంకర్ మాస్టర్ అలానే డాన్స్ షో లు కు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మోరు,సూర్యవంశం, అల్లరి పిడుగు, అరుంధతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగు తమిళ మలయాళం భాషల్లో కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎంతమంది ప్రముఖులచే ప్రశంసలందుకున్నారు .ప్రస్తుతం ఆయన అనారోగ్యం రిత్యా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Sonu Sood and Shiva Shankar Master
Also Read: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ … విషమంగా ఆరోగ్యం
కష్ట కాలమైనా కరోనా సమయంలోనే ఎంతోమందికి తన వంతు సహాయం చేసి తమ తమ గమ్యాలకు చేరేలా చేసి రియల్ హీరో గా మారారు సోను సూద్. ఇప్పుడు ఆ రియల్ హీరో నే శివశంకర్ మాస్టర్ అండగా నిలిచారు గత కొన్ని రోజులుగా శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న సోనుసూద్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాని, ఇప్పటికే తాను వారి కుటుంబంతో మాట్లాడను అని మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని తాజాగా సోనూసూద్ తన ట్వీట్లో తెలియజేశారు.
Also Read: కమల్ ఆరోగ్య పరిస్థితిపై శ్రుతిహాసన్ లేటెస్ట్ ట్వీట్