Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒక్క ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు.. భారతదేశమంతటా ఈ సిక్స్‌ప్యాక్ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, హృతిక్‌కు వివాహమై విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. తన భార్య సుసానే కాన్తో 2014లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి హృతిక్ ఒంటరిగానే జీవిస్తున్నారు.
Hrithik Roshan
Also Read: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన… బాలీవుడ్ నటి హేమ మాలిని
అయితే, సుసానే మాత్రం నటుడుఅర్స్లాన్ గోనితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హృతిక్‌తో విడిపోయిన తర్వాత ఎక్కడ కనిపించినా.. అర్స్లాన్ గోని పక్కనే ఉండటంతో జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా, సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోనికి పుట్టిన రోజు విషెష్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
నిన్న(అంటే డిసెంబరు20)న సుసానే అర్స్లాన్ గోని బర్త్ డే సందర్భంగా అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే.. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు దొరకాలని, నీ చుట్టూ స్వచ్చమైన ప్రమ నిండి ఉండాలని కోరుకుంటున్నా.. ఇప్పటి వరకు నా జీవితంలో నేను చూసిన అత్యంత పవర్ఫుల్ పర్సన్ నువ్వే.. అంటూ చెప్పుకొచ్చింది. దీనికి అర్స్లాన్ రిప్లైగాా.. లవ్యూ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం నిజమేనని బాలీవుడ్లో అనుకుంటున్నారు. అయితే, ఇది పెళ్లివరకు వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బాలీవుడ్ లో మరో కలకలం… ఐశ్వర్య రాయ్ కి ఈడీ సమన్లు