Ravi Teja Eagle Movie Teaser : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నారు రవితేజ. గతంతో పోల్చితే ఏడాది రెండు మూడు చిత్రాలు విడుదల చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఆయన జోరు పెంచారు. చడీ చప్పుడు లేకుండా ఈగల్ టైటిల్ తో ఓ మూవీ పూర్తి చేశాడు. అది కూడా భారీ పీరియాడిక్ చిత్రం. ఈగిల్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. సినిమాపై ఆసక్తి పెంచేదిగా ఉంది. టీజర్ ప్రకారం రవితేజ ఈగల్ మూవీలో రైతుగా, పెయింటర్ గా, సైనికుడిగా కనిపంచనున్నాడు.
ఇక పెయింటర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎలా అయ్యాడు. అసలు రా ఏజెన్సీ అతన్ని ఎందుకు వెతుకుతుంది. అతడి అసలు పేరేంటి? వృత్తి ఏంటీ? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తేలా టైటిల్ టీజర్ ఉంది. విజువల్స్ అబ్బురపరిచాయి. బీజీఎం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. భారీగానే ఖర్చు చేసారని అర్థం అవుతుంది.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల కీలక రోల్స్ చేస్తున్నారు. ఈగల్ నేమ్ తో కొందరికి చెమటలు పట్టించే వీరుడి కథే ఈ చిత్రమని అర్థం అవుతుంది. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నెరవేర్చాడు. దావ్ జంద్ మ్యూజిక్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే మహేష్, ప్రభాస్ సంక్రాంతి బరిలో ఉన్నారు. తాజాగా రవితేజ వచ్చి చేరారు. కాగా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో రవితేజ మరో చిత్రం చేస్తున్నారు. ఇది దసరా కానుకగా విడుదల కానుంది. నూతన దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతుంది.