Netflix OTT : కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది. సినిమా చూసే తీరు కూడా మారింది. పైగా ఓటీటీలు అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు సరికొత్త చిత్రాలను కోరుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సరికొత్త చిత్రాలను స్ట్రీమ్ చేస్తున్నాయి. ప్రస్తుతం Netflix OTT లో హత్యల నేపథ్యంలో ఉత్కంఠతో కూడిన చిత్రాలు ప్రసారమవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏమిటో ఒకసారి చూద్దామా..
మర్డర్ ముబారక్
ఓ హోటల్లో జరిగిన హత్య నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇందులో ఉన్న మలుపులు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా Netflix OTT లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ సినిమాలో సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా వంటి నటులు ఈ చిత్రంలో నటించారు. హోమి అదజానియా దర్శకత్వం వహించారు.
డామ్ సెల్
పెళ్లి అనంతరం ఓ యువరాణికి తన అత్తవారింట్లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. తనను అత్తింటి వారు తీవ్రంగా హింసిస్తారు. అనంతరం ఆమెను డ్రాగన్ ఉన్న గుహలో పడేస్తారు. దాని నుంచి ఆమె ఎలా బయటపడిందనేదే ఈ సినిమా కథ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
అన్వేషిప్పిన్ కండే తుమ్
మలయాళం లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టోవినో థామస్ హీరోగా ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో రెండు హత్య కేసులను పోలీసులు ఛేదించిన విధానం సరికొత్తగా ఉంటుంది.
మెర్రి క్రిస్మస్
హత్య నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. క్రిస్మస్ పండుగ రోజు జరిగిన ఓ హత్యకు సంబంధించి ఈ సినిమా కథ సాగుతుంది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఈ చిత్రంలో నటించారు. థియేటర్లలో అంతగా ఆడకపోయినప్పటికీ.. OTT లో మాత్రం దూసుకుపోతోంది. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తుండు
ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయింది. బిజూ మీనన్, టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించారు. రియాజ్ షరీఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ పోలీసు జీవితంలో జరిగిన పరిణామాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మాత్రమే కాకుండా బ్లాక్ ఆడం, షారుక్ ఖాన్ డంకీ, రణబీర్ కపూర్ యానిమల్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఐరిష్ విష్ వంటి సినిమాలు కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.