spot_img
HomeతెలంగాణRGV: సడన్ గా రేవంత్ రెడ్డి దగ్గరికి ఆర్జీవి ఎందుకు వెళ్ళాడు

RGV: సడన్ గా రేవంత్ రెడ్డి దగ్గరికి ఆర్జీవి ఎందుకు వెళ్ళాడు

RGV: అధికారంలో ఎవరు ఉంటే.. వారికి దగ్గరగా ఉంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, దర్శకులు. ఇండస్ట్రీకి సంబంధించిన పనులు చేయించుకుంటారు. స్వకార్యం, స్వామి కార్యం అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఇండస్ట్రీ సీఎం జగన్‌కు దగ్గర కాలేదు. చిరంజీవి, అలీ, దర్శకుడు ఆర్జీవీతోపాటు చిన్న చిన్న నటులు మాత్రమే మద్దతు ఇచ్చారు. ఆర్జీవీ అయితే వైసీపీ కార్యకర్తగా ఐదేళ్లు పనిచేశారు. ఎన్నికల ముందే వైసీపీతో కలిసి పనిచేసిన ఆయన టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారు.

సోషల్‌ మీడియాలో విమర్శలు..
ఇక వివాదాస్పద దర్శకుడు అయిన ఆర్జీవీ తరచూ సోషల్‌ మీడియాలో టీడీపీ, జనసేనపై పోస్టులు పెడుతూ విమర్శలు చేసేవారు. ఇందుకు అధికార వైసీపీ నుంచి కూడా భారీగా డబ్బులు తీసుకునేవాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. సోషల్‌ మీడియాద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు.

సడెన్‌గా తెలంగాణ సీఎం వద్ద..
ఐదేళ్లు ఏపీ సీఎం జగన్‌ వద్ద అధికార పార్టీ కార్యకర్తలా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆర్జీవీ.. సడెన్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ప్రత్యక్షమయ్యాడు. డైరెక్టర్ల అసోసియేషన్‌ అంటూ కొంతమందితో తెలంగాణ సీఎంను కలవగా, అందులో రామ్‌గోపాల్‌వర్మ కూడా ఉన్నారు. సీఎం రేవంత్‌తో ఆర్జీవీ ఫొటో దిగి అది అన్ని మీడియాల్లో వచ్చేలా తన పీఆర్‌ సాయంతో చూసుకున్నారు. ఇండస్ట్రీలో పనిచేస్తున్నా.. ఇండస్ట్రీ వ్యతిరేక గ్రూపులో ఉండే ఆర్జీవీ ఒక్కసారిగా డైరెక్టర్ల అసోసియేషన్‌లో కనిపించడం ఆశ్చర్యం కలిగించింది.

ఎందుకు వెళ్లారు..
ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్‌ పేరుతో రేవంత్‌ వద్దకు ఎందుకు వెళ్లారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్జీవీ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్‌తో ఆర్జీవీ తెలంగాణ సీఎంకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ కూటమి అధికారంంలోకి వస్తే తనను టార్గెట్‌ చేయకుండా, చంద్రబాబు శిష్యుడు అయిన రేవంత్‌ను ముందే కలిసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper