Balakrishna : నందమూరి బాలకృష్ణ చేయబోయే సినిమాల మీద ఎప్పటికప్పుడు అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే బాలయ్య బాబు ఒక సినిమాని అనౌన్స్ చేస్తాడో అప్పటినుంచి ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు చేయబోయే సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పటికే బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని తొందర్లోనే సినిమా యూనిట్ అనౌన్స్ చేయబోతుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పరుశురాం డైరెక్షన్ లో కూడా బాలయ్య బాబు మరో సినిమా చేయబోతున్నాడనే టాక్ అయితే వస్తుంది.
అయితే రీసెంట్ గా పరుశురాం ఫ్యామిలీ స్టార్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ఏ సినిమా చేసిన కూడా అదొక పెద్ద సంచలనంగా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్లిద్దరితో పాటుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక పూరి జగన్నాథ్ బాలయ్య మధ్య మంచి ర్యాపో అయితే ఉంది.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందే ‘పైసా వసూల్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించనప్పటికీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి… మరి బాలయ్య వీళ్ళలో ఎవరి సినిమాని ఫైనల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…