Harihara Veeramallu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి… గమ్యం సినిమాతో ఆయన చేసే సినిమాల్లో ఏదో ఒక కొత్త కథాంశం అయితే ఉంటుంది అని నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అప్పటినుంచి ఆయన వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో “హరిహర వీరమల్లు” అనే సినిమాను స్టార్ట్ చేసిన క్రిష్ జాగర్లమూడి.
ఈ సినిమా మరి లేట్ అవుతూ ఉండడంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నట్టుగా అఫీషియల్ గా సినిమా యూనిట్ అయితే ఒక వివరణ ఇచ్చింది. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. కాబట్టి క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఈ సినిమా లేట్ అవుతుంది కాబట్టి ఇన్ని రోజులు సినిమా మీద కేటాయించలేని దర్శకుడు వేరే సినిమాలు చేసుకోవడంలో తప్పులేదని పవన్ కళ్యాణ్ క్రిష్ కి కూడా తెలియజేశాడట.
అయితే సినిమా గ్యాప్ లో వేరే సినిమా చేసుకొమ్మని చెప్పాడట. కానీ క్రిషి మొత్తానికే ఈ సినిమా నుంచి తప్పుకొని అనుష్క ని మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సినిమా చేయడానికి ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఆయన అనుష్క తో చేయబోయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ని రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా టైటిల్ ‘ఘాటి ‘ అని ఫిక్స్ చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.
అయితే వేదం తర్వాత అనుష్కతో క్రిష్ చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక వేదం సినిమాలో అనుష్క సరోజ పాత్రలో ఒక వేశ్య గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంది. కాబట్టి ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రను పోషించి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది. మరి క్రిష్ ఈ సినిమాతో తన మ్యాజిక్ ని ఎంతవరకు రిపీట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…