spot_img
Homeఎంటర్టైన్మెంట్Trivikram: హీరోయిన్స్ జీవితాలతో ఆడుకుంటున్న త్రివిక్రమ్... ఎంత మంది బలైపోయారో తెలుసా?

Trivikram: హీరోయిన్స్ జీవితాలతో ఆడుకుంటున్న త్రివిక్రమ్… ఎంత మంది బలైపోయారో తెలుసా?

Trivikram: ఒక్కో దర్శకుడికి ఒక్కో పిచ్చి ఉంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా ఒక పిచ్చి ఉంది. అదేంటంటే హీరోయిన్స్ జీవితాలను నాశనం చేయడం. దీని అర్థం ఏమిటో? అలా అందుకు అనాల్సి వస్తుందో చూద్దాం?. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. కామెడీ, ఎమోషన్స్ కలగలిపి పక్కా మాస్ కమర్షియల్ తీయడం ఆయన నైజం. త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండాల్సిందే. ఇక ఆయన డైలాగ్స్ కి పేరు పెట్టడానికి లేదు. జీవిత సారం సెటైరికల్ గా చెబుతాడు. కామెడీ పంచులు కూడా ఓ రేంజ్లో ఉంటాయి.

ఇన్ని మంచి లక్షణాలు ఉన్న త్రివిక్రమ్ కి ఒక అవలక్షణం ఉంది. సెకండ్ హీరోయిన్ కి అన్యాయం చేస్తాడు. ఒకటి రెండు చిత్రాలు మినహాయిస్తే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒక హీరోయిన్ కథలో కీలకం. మరొక హీరోయిన్ కి కనీస ప్రాధాన్యత ఉండదు. జల్సా చిత్రం తీసుకుంటే… ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్స్. కమిలిని ముఖర్జీ కూడా ఉంది. ఇలియానాకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. పార్వతి, కమలిని అలా కనిపించి ఇలా మాయం అవుతారు.

అత్తారింటికి దారేదిలో ప్రణీత సుభాష్ పరిస్థితి కూడా సేమ్. కనీసం ఒక డ్యూయట్ ఇచ్చి ఆమెను కాపాడారు. సినిమాలో ప్రధాన హీరోయిన్ సమంతకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆదా శర్మ రోల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరీ వ్యాంప్ క్యారెక్టర్ లా ఉంటుంది. ‘అ ఆ’ మూవీలో సెకండ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశాడు. అజ్ఞాతవాసిలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా… ఎవరికీ అంత ప్రాధాన్యత ఉండదు.

అరవింద సమేత వీరరాఘవ మూవీలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా రోల్ అయితే దారుణం. అల వైకుంఠపురంలో నటించిన నివేద థామస్ అన్యాయం అయిపోయింది. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఈ సెకండ్ హీరోయిన్స్ అందరికీ స్క్రిప్ట్ చెప్పేటప్పడు త్రివిక్రమ్ మీ పాత్ర కీలకం అని చెబుతాడు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే ఏమీ ఉండదు. అరవింద సినిమా కోసం నేను బైక్ కూడా నేర్చుకున్నాను. నా సీన్స్ మొత్తం ఎడిట్ చేసి తీసేశారని ఈషా రెబ్బా ఆవేదన చెందింది. ఇలా త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ గా నటించిన వారందరూ బలైపోతున్నారు.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper