Homeఎంటర్టైన్మెంట్Tollywood Top 10 Heroines: టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ వీరే... నెంబర్ వన్ ఎవరో...

Tollywood Top 10 Heroines: టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ వీరే… నెంబర్ వన్ ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్!

Tollywood Top 10 Heroines: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తేలిపోయింది. ప్రముఖ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట ఆ సంస్థ చేసిన సర్వే ప్రకారం టాప్ లో ఎవరున్నారు? నెంబర్ వన్ పొజీషన్ ఎవరి దక్కిందో చూద్దాం.. మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ఫార్మ్ లో ఉన్నారు. టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె క్రేజ్ రెట్టింపు అయింది. అనుపమ 10 స్థానంలో ఉంది.

పూజా హెగ్డే ప్రస్తుతం స్ట్రగుల్ లో ఉన్నారు. ఆమెకు రెండేళ్లుగా హిట్ పడలేదు. తెలుగులో నటించి చాలా కాలం అవుతుంది. పూజా హెగ్డే కి 9వ స్థానం దక్కింది. కీర్తి సురేష్ గత ఏడాది దసరా, భోళా శంకర్ లో కనిపించింది. ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. ప్రేక్షకులు కీర్తి సురేష్ కి 8వ స్థానం ఇచ్చారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కాస్త స్లో అయింది. గతంతో పోలిస్తే ఆమెకు అవకాశాలు తగ్గాయి. తమన్నా కు 7వ స్థానం లభించింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫార్మ్ లో ఉంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. రష్మిక అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. కానీ టాప్ 5 లో ఆమెకు చోటు దక్కలేదు. ఆడియన్స్ రష్మికకి 6వ స్థానం ఇచ్చారు. సాయి పల్లవి తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతుంది. కానీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సాయి పల్లవి 5వ స్థానంలో నిలిచింది.

యంగ్ బ్యూటీ శ్రీలీల 4వ స్థానంలో ఉంది. గత ఏడాది శ్రీలీల హీరోయిన్ గా నెలకొక సినిమా రిలీజ్ అయింది. తన అందం, డాన్సులతో టాలీవుడ్ ని ఊపేసింది. అనుష్క శెట్టి టాప్ 3 స్థానం దక్కించుకుంది. అనుష్క సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. కాజల్ అగర్వాల్ కి ప్రేక్షకులు టాప్ 2 స్థానం ఇచ్చారు. ఆమె ప్రస్తుతం ఫార్మ్ లో లేరు. అయిన కూడా కాజల్ కి క్రేజ్ తగ్గలేదు. అందర్నీ వెనక్కి టాప్ 1లో నిలిచింది హీరోయిన్ గా సమంత. సినిమాలకు ఏడాది గ్యాప్ తీసుకున్నప్పటికీ సమంత అగ్రస్థానం దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular