Murder Mubarak OTT: కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమా చూసే విధానంలో మార్పు వచ్చింది. ఇదే సమయంలో రొటీన్ రోడ్డు కొట్టుడు సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. ఇక ప్రేక్షకుల ఇష్టానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా చిత్రాలు స్ట్రీమ్ చేస్తున్నాయి, నిర్మిస్తున్నాయి. అలా చిత్రాలను నిర్మించడంలో నెట్ ఫ్లిక్స్ ముందు ఉంటుంది. ఆ నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఓ హత్య కేసు నేపథ్యంలో నిర్మించిన మర్డర్ ముబారక్ (Murder Mubarak review) స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
తారాగణం: పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సుహైల్ నయ్యర్, తారా ఆలీషా బెర్నీ, ఇతర నటీనటులు.
బ్యానర్: మడోక్ ఫిలిమ్స్.
నిర్మాత: దినేష్
దర్శకత్వం: హోమి అదజానియా
నేపథ్యం: అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యు టు డెత్ నవల ఆధారంగా..
వేదిక: నెట్ ఫ్లిక్స్, మార్చి 15 నుంచి స్ట్రీమింగ్
భాషలు: తెలుగు, తమిళం, హిందీ.
కథ ఏంటంటే
డబ్బున్న వాళ్ళు బాగా ఉండే రాయల్ ఢిల్లీ క్లబ్ లో ఒక హత్య జరుగుతుంది. ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేశారు? దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు పోలీస్ అధికారి భవాని సింగ్ (పంకజ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసును అతడు ఛేదించాడు? ఈ హత్యలో ఎవరు కీలకపాత్ర పోషించారు? అనే కోణాల్లో ఈ సినిమా కథ సాగుతుంది. ఇంటర్వెల్ ముందు సీన్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. హత్య నేపథ్యంలో జరిగే ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా మలిచాడు. కొన్ని కొన్ని సీన్లు అతి అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీత లాగా కనిపిస్తాయి. మొత్తానికి వీకెండ్ లో మంచి కాలక్షేపం కావాలంటే.. ఈ సినిమా చూడొచ్చు. విజయ్ వర్మ, సారా అలీ ఖాన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది.. కొన్ని సన్నివేశాలు ఏ కేటగిరీలో ఉంటాయి. అయితే ఫ్యామిలీతో చూడాలా? వద్దా? అనేది మీ ఇష్టం.
గత ఏడాది ఫిబ్రవరిలోనే మర్డర్ ముబారక్ షూటింగ్ మొదలు పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని చివరికి ఈ ఏడాది మార్చి 15 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకి లినేష్ దేశాయ్ సినిమాటోగ్రఫీ అందించారు. సచిన్ జిగర్ సంగీతం సమకూర్చారు.. దర్శకుడు హోమి అదజానియా ఇదివరకు ఫ్లెమింగో అనే హత్య, ప్రతీకారం నేపథ్యంలో సిరీస్ రూపొందించారు. అంతకుముందు ఆయన కాక్ టెయిల్, ఫైండింగ్ ఫన్నీ, బిల్లింగ్ సైరస్ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు.
రేటింగ్ 3/5