Kangana Ranaut
Kangana Ranaut: దేశంలో పార్లమెంట్ కు 4వ ఫేజ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐక ఐదో ఫేజ్ కు కొన్ని రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 7వ ఫేజ్ కు సంబంధించి నిన్న (మే 14) మంగళవారం చివరి గడువు కావడంతో ప్రధాని నరేంద్రన మోడీ కాశీ నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. ఇదే రోజు మరో అభ్యర్థి బాలీవుడ్ నటి కంగనా రౌనత్ తన నామినేషన్ ను దాఖలు చేసింది. దీంతో దేశం దృష్టి కంగనాపై పడింది. అసలు ఆమె గెలుస్తుందా? ఆమె గెలుపునకు ఏం చేయాలన్న దానిపై విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2009 నుంచి 2021 వరకు, మండి స్థానానికి మూడు సాధారణ ఎన్నికలు, రెండు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడుసార్లు కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో వీరభద్ర సింగ్, 2013, 2021 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్ మండి స్థానం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న మండికి జూన్ 1వ తేదీ పోలింగ్ జరగనుంది. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ బాలీవుడ్ నటి అయిన కంగనా రౌనత్ ను బరిలోకి దింపింది.
కంగనాను ప్రకటిస్తారన్న విషయం బీజేపీ వర్గాలకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె అభిమాని. గత రెండేళ్లుగా తన రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆమె కూడా పాల్గొన్నారు.
కంగనా మండి జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జన్మించారు. కాబట్టి స్థానికత వర్తిస్తుందని పార్టీ వర్గాలు చెప్తు్న్నాయి. ఆమె ముత్తాత సర్జూ సింగ్ రనౌత్ గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె తల్లి, ఆశా రనౌత్, మండిలో పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందింది. ఆమె తండ్రి అమర్‌దీప్ వ్యాపారవేత్త.
కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య
మండి సిట్టింగ్ ఎంపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైన ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య. ప్రతిభా సింగ్ ఈ పార్లమెంట్ స్థానం నుంచి మూడు సార్లు విజయం సాధించింది. కానీ, 2019లో ఓటమి పాలైంది. తర్వాత 2021లో ఉపఎన్నిక జరగగా.. భారీ తేడాతో విజయం సాధించింది. 6 సార్లు హిమాచల్ సీఎంగా పనిచేసిన ఆమె భర్త వీరభద్ర సింగ్ మరణం తర్వాత వచ్చిన ఎన్నికలు కాబట్టి సానుభూతి కూడా తోడైంది.
ఈ సారి పరిస్థితులను గమనిస్తే.. మోడీ వేవ్, కంగనా చరిష్మా కలిసి మండి బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. రెండు సార్లు సిమ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విక్రమాదిత్య పార్లమెంట్ ఎన్నికల్లో అంతగా రాణించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి నేపథ్యంలో ‘నేను హిందువును, రాముడి ఆశీస్సులు ఉంటాయి’ అంటూ చెప్పుకోవల్సిన పరిస్థితి విక్రమాదిత్యకు ఏర్పడింది. పైగా చివరి నిమిషం వరకు ఆయనను ప్రకటించకపోవడం కొంత వరకు మైనస్ కావచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి.
కంగనా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు హాజరవడం, బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న నటి, దైవ భక్తురాలు, కుటుంబం రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. నిన్న నామినేషన్ సందర్భంగా తీసిన భారీ ర్యాలో మాజీ సీఎం పాల్గొనడంతో పాటు భారీగా జనం తరలివచ్చారు. ఇవన్నీ ఆమె గెలుపును నల్లేరుపై నడకలాగా మారుస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
View Author's Full InfoWeb Title: Actress kangana ranaut has filed nomination from mandi lok sabha seat