Telangana Rains: అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యలను ఆగం చేసింది. హైదారాబాద్ నగరంలో కొన్ని గంటలపాటు జనజీవనం స్తంభించింది.
– శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్‌చెరు వరకు పాత బస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి పొర్లాయి. రోడ్లు నదులను తలపించాయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
– మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. రైతులకు తీరని నష్టం జరిగింది. పిడుగుపాటు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతిచెందాడు.
నల్గొండ జిల్లా కనగల్‌లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షాపాత 10.2 సెంటీమీటర్లు కురిసింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 9 సెంటీమీటర్లు, షేక్‌పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జీహెచ్ఎసం పరిదిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీలో దెబ్బతిన్న పంటలు..
ఇక ఆంధ్రప్రదేశ్‌లోను భారీ వర్షాలు కురిశాయి. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు 1290 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా, ఇందులో 1060 ఎకరాల్లో దెబ్బతిన్న మామిడి పంట నష్టం రూ.1.93 కోట్లుగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు లెక్కలు కట్టారు.
తడిసిన ధాన్యం కొనాలని ఆందోళన..
అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనాలని తెలంగాణలో రైతులు రోడ్డెక్కారు. వర్షాలకు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళనబాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) సబ్ మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మోత్కూర్–భువనగిరి ప్రధాన రహదారిపై రైతులు ౖబైఠాయించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతపూర్‌లో వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కళ్లాల వద్ద ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ధాన్యం తడిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాéన్యం పూర్తిగా తడిసిపోయింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Heavy rains for five days yellow alert issued for several districts of telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com