.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకున్నాడు. ఇటీవల బ్యాటింగ్‌లో ఆయన ఘోరంగా విఫలం అవుతుండగా ఆటపై మరింత దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి వెనక్కి తగ్గి ఇయాన్ మోర్గాన్‌కు బాధ్యతలు అప్పగించాడు. ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ నుంచి కొత్త కెప్టెన్సీ ఆధ్వర్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడనుంది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్లు టేబుల్లో కొల్కతా 4వ స్థానంలో ఉంది.