Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా లెవెల్ లో తన మార్కుని ఎలా ఏర్పర్చుకున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాము. గంగోత్రి సినిమా నుండి ‘పుష్ప : ది రూల్’ వరకు అల్లు అర్జున్ ఎదిగిన తీరు చూస్తూ ఉంటే ప్రతీ ఒక్కరికి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. ఆయన కెరీర్ ప్రారంభం లో ఎన్నో అవమానాలు కూడా ఎదురుకున్నాడు.
అల్లు అర్జున్ మొదటి సినిమా చూసి ఇతను హీరో ఎలా అయ్యాడు అని చాలా మంది అనుకున్నారు, కొంతమంది అయితే ప్రముఖ స్థానాల్లో ఉండి కూడా కామెంట్స్ చేసారు. ఒక ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అల్లు అర్జున్ పై అప్పట్లో ఇతను హీరో నా అంటూ వెక్కిరిస్తూ తన సన్నిహితులతో కామెంట్ చేసాడట. అతను మరెవరో కాదు కరణ్ జోహార్. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ , అమిర్ ఖాన్, హ్రితిక్ రోషన్ ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ తో పని చేసిన అనుభవం ఆయనది.
ఇప్పుడు ఆయన టాలీవుడ్ నుండి వస్తున్న సినిమాలను బాలీవుడ్ లో కొనుగోలు చేసి గ్రాండ్ గా విడుదల చేస్తున్నాడు. అప్పట్లో ఈయనకి టాలీవడ్ అంటే చాలా చిన్న చూపు ఉండేదని అందరూ అంటుంటారు. అలా అల్లు అర్జున్ మీద కూడా అప్పట్లో ఈయన కామెంట్స్ చేసాడనే రూమర్ ఎప్పటి నుండో ఉంది.
కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తన టాలెంట్ తో ఏ రేంజ్ కి ఎదిగాడంటే, తన సినిమా కోసం ఆ కరణ్ జోహార్ లాంటి వాళ్ళు కూడా ఎదురు చూసే స్థాయికి, ఇలాంటి హీరో తో ఒక్క సినిమా అయినా తియ్యాలి, డేట్స్ సంపాదించాలి అని పరితపించే స్థాయికి ఎదిగాడు. ఇది కదా నిజమైన సక్సెస్ అంటే,టాలెంట్ మరియు కష్టపడే తత్త్వం ఉండే ఒక మనిషి ఎంత ఎత్తుకి ఎదగగలడో క్లాసిక్ ఉదాహరణ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నేడు ఈయన పాన్ వరల్డ్ స్టార్. ఇతని సినిమాల కోసం ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తాది. రాబొయ్యే రోజుల్లో ఈయన ఇంకెంత స్థాయికి చేరుకుంటాడో చూడాలి.