Karnataka : అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి… కర్ణాటక ఓటర్లకు కాంగ్రెస్ షాక్!
కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఓచర్ల పంపిణీ కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్ చేయించారా.. లేక కాంగ్రెస్ అధిష్టానమే పంపించిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మోసపోవడం కర్ణాటక ఓటర్ల వంతైంది.

Karnataka : ఏదేదో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి.. ఓ సినిమాలో బాలయ్య డైలాగ్ ఇది.. దీనిని కొద్దిగా మార్చి కర్ణాటక ఓటర్లకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలకు ముందు ‘ఎన్నెన్నో చెబుతాం.. అన్నీ నెరవేరుస్తామా ఏంటి’ అన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోంది. అక్కడ కొత్త సర్కార్ కొలువుదీరి వారం రోజులు కూడా కకముందే పాలక పక్షం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనే కారణం. ఐదు ప్రధాన హామీలు నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూడా అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసింది. తాజాగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తమ్ముడు డీకే. సురేశ్ మరోషాక్ ఇచ్చాడు. ఎన్నికల వేళ ఓటర్లకు పంచిన ఓచర్లు పనిచేయకుండా చేశాడు.
