Homeబిజినెస్Mark Zuckerberg: జుకర్ బర్గ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. ఫొటోలు...

Mark Zuckerberg: జుకర్ బర్గ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. ఫొటోలు వైరల్

Mark Zuckerberg: ఫేస్ బుక్ (ఇప్పుడు మెటా) సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మే, 14న 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. అందరిలాగే మెటా సీఈఓ కూడా తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ‘స్పెషల్ గెస్ట్’తో కలిసి ఈ రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను జుకర్ బర్గ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇన్ స్టా పోస్ట్ లో, జుకర్ బర్గ్ తన భార్య ప్రిస్కిల్లాతో పాటు తను ప్రారంభ రోజుల్లో నివసించిన ప్రదేశాలను సర్మించుకున్నాడు.

ఇందులో అతను ఉన్న చిన్ననాటి పడకగది, అతను కోడింగ్ నేర్చుకున్న కంప్యూటర్. అతను ఫేస్ బుక్ ప్రారంభించిన హార్వర్డ్ వసతి గృహం, నేలపై పరుపుతో అతని మొదటి నోట్: టెక్నాలజీ న్యూస్

అపార్ట్‌మెంట్, అతని మునుపటి కార్యాలయ ప్రదేశాలు ఉన్నాయి. వైరల్ పిక్స్ తో మార్క్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లింక్ ఇలా ఉంది.

ఇప్పుడు ఈ ఫొటోలలో విశేషం ఏంటంటే ఒక ఫొటోలో ఆయన (బిల్ గేట్స్) ‘ప్రత్యేక అతిథి’ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓతో కలిసి ఫోజులిచ్చాను. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జుకర్ బర్గ్, గేట్స్ ఇద్దరం ఒకే యూనివర్సిటీ హార్వర్డ్ నుంచి బయటకు వచ్చి అతిపెద్ద టెక్ కంపెనీ (గతంలో ఫేస్బుక్), మైక్రోసాఫ్ట్ ను ఏర్పరిచాం.

మరో ఫొటోలో జుకర్ బర్గ్ రీక్రియేటెడ్ పినోచియోస్ పిజ్జారియాలో ఫొటోలు దిగారు. ఒక ఫొటోలో తన కూతుళ్లకు తను పెరిగిన గదిని చూపిస్తున్నాడు. మరో ఫోటోలో షేర్ చేసిన జుకర్ బర్గ్ తన పుట్టినరోజును జరుపుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జుకర్ బర్గ్ భార్య ప్రిస్కిల్లా చాన్ కూడా జుకర్ బర్గ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఆమె ఇలా రాసింది ‘మార్క్ సాధారణంగా తన పుట్టినరోజుకు నన్ను పెద్దగా వెళ్లనివ్వడు, కానీ అతని 40వ పుట్టినరోజు కోసం, మా స్నేహితులు. కుటుంబ సభ్యులు కూడా అతన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ కావసినంత విందు ఇచ్చేందుకు అన్ని సమకూర్చాను. మేమంతా ఆనందంలో మునిగి తేలాం.. ఫంక్షన్ కు వచ్చిన వారందరూ చాలా ఆనందంగా ఎంజీయ్ చేశారు’ అని ఆమె చెప్పారు.

తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు మైక్రోసాఫ్ట్ సీఈవో రావడం తనుకు చాలా ఆనందంగా ఉందని జుకర్ బర్గ్ అన్నారు. బిల్ గేట్స్ ను కౌగిలించుకొని మరీ ఆనందం వ్యక్తం చేశాడు. బిల్ గేట్స్ ఉన్నతమైన వ్యక్తి అన్న జుకర్ బర్గ్ లైఫ్ లో క్రిటికల్ పొజిషన్ లో ఆయన సూచనలే గుర్తస్తాయని చెప్పుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mark Zuckerberg (@zuck)

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular