Balakrishna
Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రి లో నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పటినుంచో బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ కూడా బాలయ్య బాబుకు చాలా క్లోజ్ గా ఉంటాడు. ఎందుకంటే ఆహా లో వచ్చిన అన్ స్టాపబుల్ షో మొదటి సిజన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. కాబట్టి అప్పటినుంచి వీళ్ళ మధ్య మంచి ర్యాపో అయితే ఉంది. ఇక దీని వల్లే ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో కూడిన సినిమా స్టోరీని రెడీ చేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు బాలయ్య ప్రశాంత్ వర్మ ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు.
కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే అనుమానలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే బాలయ్య బాబు కోసం రాసుకున్న స్టొరీ ని ఎవరు చేయలేరట. అది బాలయ్య మాత్రమే చేయగలడట. ఇక ఎప్పటికైనా దాన్ని బాలయ్య తోనే చేయాలనే ఉద్దేశ్యంలో ప్రశాంత్ వర్మ ఉన్నారట. ప్రస్తుతం ఆయన ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా బాలీవుడ్ లో ‘రన్వీర్ సింగ్’ తో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.
కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ముగిసిన తర్వాత ఆయన బాలయ్య సినిమా మీదికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. మరి బాలయ్య బాబు మాత్రమే ఆ క్యారెక్టర్ చేయగలడు అని ప్రశాంత్ వర్మ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే అది ఎంత డెప్త్ తో ఉన్న స్టోరీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Balakrishna in the direction of prashant varma how is the movie going to be